AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC అభ్యర్థులకు కమిషన్ హెచ్చరిక.. ‘ఒక్కరికీ ఒకే OTPR ఐడీ మాత్రమే ఉండాలి!’

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అభ్యర్థులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రతి అభ్యర్థికి ఒకే OTPR ఐడీ ఉండాలని, బహుళ ఐడీలను సృష్టించవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే వేర్వేరు OTPR ఐడీలతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు వెంటనే APPSC హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించింది. లేదంటే భవిష్యత్తులో దరఖాస్తులు తిరస్కరణకు గురైనా, ఇతర సమస్యలు ఎదురైనా అభ్యర్థులదే బాధ్యతని కమిషన్ హెచ్చరించింది..

APPSC అభ్యర్థులకు కమిషన్ హెచ్చరిక.. 'ఒక్కరికీ ఒకే OTPR ఐడీ మాత్రమే ఉండాలి!'
APPSC Issues New Guidelines on OTPR
Srilakshmi C
|

Updated on: Nov 18, 2026 | 6:26 AM

Share

అమరావతి, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అభ్యర్థులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతి అభ్యర్థికి ఒకే ప్రత్యేకమైన వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ఐడీ మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ OTPR ఐడీలను సృష్టించకూడదని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వివిధ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని కమిషన్ పేర్కొంది. ఒకే వ్యక్తి బహుళ OTPR ఐడీలను కలిగి ఉండటం వల్ల భవిష్యత్తులో దరఖాస్తుల పరిశీలన సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.

APPSC వెబ్‌సైట్‌లో అభ్యర్థులు కేవలం ఒకే ప్రత్యేకమైన OTPR ఐడీని కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటి కంటే ఎక్కువ OTPR ఐడీలను సృష్టించవద్దని కమిషన్ స్పష్టం చేసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అదే ఐడీని ఉపయోగించి తదుపరి ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే బహుళ ఐడీలు ఉన్నవారు ఏం చేయాలి?

కొంతమంది అభ్యర్థులు వేర్వేరు OTPR ఐడీలను సృష్టించి, వాటి ద్వారా వివిధ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. అలాంటి అభ్యర్థులు వెంటనే APPSC హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించింది. హెల్ప్‌డెస్క్ ద్వారా తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన సవరణలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. బహుళ OTPR ఐడీల సమస్యను సకాలంలో పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని APPSC హెచ్చరించింది. ఇలాంటి కారణాలతో అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఎదురైనా కమిషన్ బాధ్యత వహించదని స్పష్టం చేసింది. కాబట్టి APPSC ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ OTPR వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలి. ఇప్పటికే బహుళ ఐడీలు ఉన్నవారు ఆలస్యం చేయకుండా కమిషన్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవడం మంచిది.

Follow Us