టీవీ9 లో సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పాతికేళ్ళ అనుభవం ఉంది. 1998లో ఈనాడు రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం. 2004లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్థానం ప్రారంభించారు. 2009 వరకు మాటీవి లో ఆ తరువాత 2010 నుంచి ఇప్పటి దాకా టీవీ9 జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. రాయలసీమ రాజకీయ, చారిత్రక, సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టు. సీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వార్తల సేకరణ, కవరేజ్ లో తనదైన ముద్ర వేశారు. పలు పరిశోధనాత్మక, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తా కథనాలు అందించారు.
రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా కంగుతిన్న భక్తులు..
శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న పాములు తరచూ భక్తులను భయపెడుతున్నాయి. నడక దారి భక్తులకు పలు రకాల విష సర్పాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే అలిపిరి నడక మార్గంలో ఉన్న రాములవారి ఆలయ పోటులో పాము కనిపించింది. దాదాపు 8 అడుగుల పొడవైన జెర్రిపోతు ఆలయ సిబ్బంది కంటపడింది.
- Raju M P R
- Updated on: Apr 18, 2025
- 8:37 pm
TTD Income: రికార్డులు క్రియేట్ చేస్తోన్న కలియుగం అపర కుబేరుడు శ్రీవెంకటేశ్వరుడు..!
తిరుమల శ్రీవారి ఆదాయం.. అంతకంతకూ పెరుగుతోంది. ఓవైపు హుండీ, మరోవైపు డిపాజిట్లపై వస్తున్న వడ్డీ, ఇంకోవైపు భారీ విరాళాలతో తిరుమలేశుడు పెద్ద సంపన్నుడయ్యాడు. వార్షిక బడ్జెట్ ముందు టీటీడీ వేసిన లెక్కలు... బడ్జెట్ తర్వాత అధికారుల అంచనాలు చూస్తుంటే.. శ్రీవారు నిజంగా 'వడ్డీ'కాసులవాడే అనిపిస్తోంది..! అలాగే.. కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అన్నట్లుగా ఉంది శ్రీవారి ఆదాయ చిట్టా..!
- Raju M P R
- Updated on: Apr 17, 2025
- 5:59 pm
వేటాడేందుకు వచ్చి ఉచ్చులో చిక్కి ప్రాణం కోల్పోయిన రెండేళ్ల చిరుత.. ఈ పాపం ఎవరిది..?
వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడి పోరాడి చివరకు ఓడిపోయింది. చిరుతను కాపాడడంలో అటవీశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. చిరుత మృతిపై పరిసర ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే చిరుత ప్రాణాలు దక్కేవంటున్నారు.
- Raju M P R
- Updated on: Apr 16, 2025
- 6:08 pm
Tirumala: తిరుమల కొండపై డ్రోన్ కలకలం.. యూట్యూబర్ అరెస్ట్..
తిరుమల కొండలపై విమానాలు తరచూ ఎగురుతుండటం ఈ మధ్యకాలంలో సర్వ సాధారణమైంది.ఏకంగా శ్రీవారి ఆలయం సమీపంలోనే విమానాల రాకపోకలు సాగించడం భక్తుల కంటపడుతోంది.ఆనంద నిలయం పైనా ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణం భక్తులను కలవరపెడుతోంది. అయితే.. తిరుమల కొండపై విమానాలు ఎగరడం ఆగమ శాస్త్ర విరుద్ధమన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది.
- Raju M P R
- Updated on: Apr 16, 2025
- 7:09 am
Andhra Pradesh: రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. తండ్రిని చూసేందుకు వచ్చి..!
చిత్తూరులో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. హత్యనా..? లేక ఆత్మహత్యనా? అన్న దానిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఒకరేమో ఆత్మహత్య, మరొకరి వాదనేమో హత్య అసలు ఏమి జరిగిందన్న దానిపై పోలీసులు నోరు మెదపకపోవడంతో సస్పెన్స్‌కు కారణమైంది. చిత్తూరులో పరువు హత్య జరిగిందన్న చర్చ కూడా నడుస్తోంది.
- Raju M P R
- Updated on: Apr 14, 2025
- 4:31 pm
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. మూడంతస్తుల భవనానికి వేలాడుతూ కనిపించిన డెడ్ బాడీ! తీరా చూస్తే..
వృద్ధాప్యం శాపంగా మారిందో.. లేదంటే ధనవంతుడిగా సమాజంలో మెలగడమే అతడిని బలి తీసుకుందో తెలియదుగానీ ఓ వృద్ధుడు మూడు అంతస్థుల భవనానికి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఇది హత్య.. ఆత్మహత్య అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే.. సినీ ఫక్కీలో భారీ భవనానికి వృద్ధుడి డెడ్ బాడీ వేలాడటం ఆ ఊరి జనాలను కలవరపాటుకు గురిచేసింది..
- Raju M P R
- Updated on: Apr 14, 2025
- 8:45 am
Tirumala: శ్రీవారి సేవలో పవన్‌కల్యాణ్ సతీమణి.. స్వామివారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు చెల్లించుకున్న అన్నాకొణిదెల
పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవాల తనయుడు శంకర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి తన మొక్కులు తీర్చుకున్నారు అన్నా లెజీనోవా. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.
- Raju M P R
- Updated on: Apr 14, 2025
- 8:30 am
నల్లారి ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్ ఎంట్రీ? ఉమ్మడి ఏపీ ఆఖరి సీఎం ప్లాన్ ఏంటి?
పొలిటికల్‌గా ఆయన నిర్ణయాలన్నీ సస్పెన్సే.. బీజేపీ లో కొనసాగుతున్న ఆయన వ్యూహం ఏంటన్నది కూడా ఇప్పుడు కేడర్ కు అంతు చిక్కనిదే. ఒక వైపు సొంతూరులో చక చకా ఇంటి నిర్మాణం, మరో వైపు క్యాడర్ కు కొడుకును దగ్గర చేసే ప్రయత్నం. ఇదే ఇప్పుడు పెద్ద చర్చ గా మారింది. రానున్న ఎన్నికలకు కొడుకును సిద్ధం చేయడానికేనా... అందుకే రాజకీయ వారసుడిగా అందరికీ పరిచయం చేయిస్తున్నాడా... అనుచరుల కన్ఫ్యూజన్ ఏంటి..? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంతర్యమేంటి..?
- Raju M P R
- Updated on: Apr 13, 2025
- 5:31 pm
Tirupati: గోవింద నామస్మరణ చేస్తూ కాలినడకన భక్తులు.. మార్గంలో కనిపించింది చూడగా
తిరుమల కాలినడకన గోవింద నామస్మరణ చేస్తూ కొండపైకి ఎక్కుతున్నారు భక్తులు. ఇంతలో వారికి మార్గం మధ్యలో ఓ వింతైన ఆకారం కనిపించింది. ఏంటా అని చూడగా.. చూడగానే దెబ్బకు గుండె బద్దలైనంత పనైంది. బాబోయ్.! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 అడుగులు..
- Raju M P R
- Updated on: Apr 12, 2025
- 12:04 pm
Andhra News: పరువు కోసం కన్న బిడ్డ ఉసురు తీసిన తల్లి.. చేతులు కట్టేసి కిరాతకంగా..
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. పరువు ఖరీదు కన్న బిడ్డ ప్రాణం అయింది. కులం తక్కువ యువకుడిని కూతురు ప్రేమించిందని.. కన్నతల్లి ఆమె ప్రాణం తీసింది.. చంద్రగిరి పీఎస్ పరిధిలోని నరసింగాపురంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల విచారణలో తల్లి ఘాతుకం వెలుగు చూసింది. ఈ నెల 4న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నరసింగాపురంలో 17 ఏళ్ల మైనర్ బాలిక మృతిపై గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు వ్యవహారం బయటపడింది.
- Raju M P R
- Updated on: Apr 12, 2025
- 9:21 am
Sita Rama Kalyanam: నేడు పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం.. సీతారామ లక్ష్మణులకు కానుకగా స్వర్ణ కిరీటాలు
ఆంధ్రప్రదేశ్ లోని కోదండ రాముడు వెండి వెన్నెలలో సీతమ్మని ఈ రోజు పరిణయం చేసుకోనున్నాడు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. సీతారాములకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు దుస్తులను సమర్పించనున్నారు. సిఎం కుటుంబ సమేతంగా వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు రామయ్య కల్యాణం సందర్భంగా శీవారి తరపున టీటీడీ భారీ కానుకలను పంపింది.
- Raju M P R
- Updated on: Apr 11, 2025
- 3:43 pm
AP News: అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్..ఆయన ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే!
ఆయన ఓ పంచాయతీ కార్యదర్శి. ఆయన ఆస్తుల విలువ చూస్తే బైర్లు కమ్మాల్సిందే. అలా ఉంది మరి మనోడి సంపాదన. ఇతని ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. గత ఫిబ్రవరి 28న చంద్రగిరి పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఏసీబీ సోదాల్లో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు మహేశ్వరయ్య అనే పంచాయతీ కార్యదర్శి. దీంతో మహేశ్వరయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
- Raju M P R
- Updated on: Apr 9, 2025
- 12:33 pm