నిజామాబాద్‌లోని గోశాలలో హోలీ వేడుకలు అత్యంత వినూత్నంగా జరిగాయి. సిద్ధయోగ క్షేత్రం ఆధ్వర్యంలో కృత్రిమ రంగులకు దూరంగా మట్టి స్నానం, యోగాసనాలతో హోలీని నిర్వహించారు. నిర్వాహకులు సిద్ధిరాములు దీనివల్ల చర్మ వ్యాధులు దూరమై, ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వివరించారు. యువకులు, ప్రకృతి ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.