Raveena Tandon: నాగార్జునతో ఫస్ట్ సినిమా.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్..
తెలుగు, హిందీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో అగ్ర కథానాయికగా చక్రం తిప్పింది. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంది. తిరుమల శ్రీవారిని మంగళవారంఉదయం దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు సీనియర్ హీరోయిన్ రవీనా టాండెన్. నటి, నిర్మాత, టీవీ హోస్ట్ అయిన రవీనా విఐపి విరామ సమయంలో కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ధ్వజస్తంభంకు మొక్కులు చెల్లించిన రవీనా టాండెన్ కు రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన రవీనా టాండెన్ ను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. సెల్ఫీలు ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‌ను ఊపేసిన ఫోక్ సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
