AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ 2026లో నేడు డబుల్ ధమాకా.. ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌ను ఢీకొట్టనున్న గుజరాత్.. గెలుపెవరిదో?

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ మొదటి డబుల్ హెడర్ నేడు జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్, రాత్రి 7:30 గంటలకు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. క్రికెట్ ప్రేమికులు ఈ రెండు మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

IPL 2026 : ఐపీఎల్ 2026లో నేడు డబుల్ ధమాకా.. ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌ను ఢీకొట్టనున్న గుజరాత్.. గెలుపెవరిదో?
Dc Vs Mi
Rakesh
|

Updated on: Apr 04, 2026 | 1:16 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి పీక్స్‌కు చేరింది. ఇప్పటివరకు 7 ఉత్కంఠభరితమైన పోరులు ముగియగా, నేడు క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా ఎదురుకానుంది. ఈ సీజన్‌లోనే మొదటి డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మధ్యాహ్నం ఢిల్లీ వర్సెస్ ముంబై, సాయంత్రం గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి ఊపు మీద ఉన్నాయి. ముంబై బ్యాటర్లు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా, ఢిల్లీ బౌలర్లు గత మ్యాచ్‌లో నిప్పులు చెరిగారు. అయితే ఢిల్లీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నా, నేడు వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశం ఉందని సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడనుంది.

ఇక రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ గత మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసి తిరుగులేని ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు ఆ జట్టుకు బలంగా మారారు. మరోవైపు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తన మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. ఎలాగైనా నేడు సొంత గడ్డపై గెలిచి బోణీ కొట్టాలని గిల్ సేన పట్టుదలతో ఉంది.

క్రికెట్ ప్రేమికులు ఈ రెండు మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. మధ్యాహ్నం మ్యాచ్ 3:30 గంటలకు మొదలవుతుండగా, సాయంత్రం మ్యాచ్ 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి మ్యాచ్‌కు అరగంట ముందే టాస్ వేస్తారు.

ఢిల్లీ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది, కాబట్టి భారీ స్కోర్లు ఆశించవచ్చు. ఇక అహ్మదాబాద్‌లోని పిచ్ పేసర్లకు సహకరిస్తూనే, బ్యాటర్లకు కూడా పరుగుల విందును అందిస్తుంది. సాయంత్రం వేళ మంచు కురిసే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్ మొదటి డబుల్ హెడర్ కావడంతో స్టేడియాలు కిక్కిరిసిపోయే అవకాశం ఉందని మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us