AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే అద్భుతాలు ఇవే..

సాధారణంగా మనం పండును చూడగానే ముందుగా చేసే పని దాని తొక్క తీయడం. నారింజ అయినా, బొప్పాయి అయినా లోపల ఉన్న గుజ్జును మాత్రమే తిని, తొక్కను చెత్తబుట్టలో పడేస్తాం. కానీ అసలు సిసలైన పోషకాలు ఆ తొక్కలోనే ఉన్నాయని మీకు తెలుసా..? ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో మూడో వంతు కేవలం తొక్కల రూపంలోనే వృథా అవుతోంది. ఈ వేస్ట్‌ను బెస్ట్‌గా మార్చుకునే 5 అద్భుతమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

Krishna S
|

Updated on: Apr 28, 2026 | 9:36 PM

Share
నారింజ తొక్కలతోమిఠాయిలు: నారింజ తొక్కలను పారేయకుండా వాటితో అద్భుతమైన డెజర్ట్స్ తయారు చేసుకోవచ్చు. నారింజ తొక్కలు, నిమ్మరసం, పంచదార కలిపి ఉడికిస్తే రుచికరమైన మార్మలేడ్ సిద్ధమవుతుంది. తొక్కలను చిన్న ముక్కలుగా కోసి పంచదార ద్రావణంలో ఉడికిస్తే క్యాండీడ్ ఆరెంజ్ పీల్ అనే మిఠాయి రెడీ అవుతుంది. ఈ ప్రక్రియలో లభించే ఆరెంజ్ సిరప్‌ను డ్రింక్స్‌లో ఫ్లేవర్‌గా వాడుకోవచ్చు.

1 / 5
పైనాపిల్ తొక్కతో మెక్సికన్ డ్రింక్ టెపాచే: పైనాపిల్ బయటి భాగం గరుకుగా ఉండి తినడానికి వీలుండదు. కానీ దానితో ఒక అద్భుతమైన పానీయం తయారు చేయవచ్చు. పైనాపిల్ తొక్కను, లోపలి కాండాన్ని నీరు, చక్కెర కలిపి 24-36 గంటల పాటు పులియబెట్టాలి. ఇలా తయారైన పానీయంలో ప్రోబయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.

2 / 5
అల్లం తొక్కతో ఔషధ గుణాలు: చాలామంది అల్లాన్ని పూర్తిగా గీకి వాడుతుంటారు. కానీ అల్లం పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అల్లం తొక్కలను సూప్‌లలో వేయవచ్చు లేదా నీటిలో మరిగించి రసంలా తీసుకోవచ్చు. తొక్కలను ఎండబెట్టి, పొడి చేసి టీ పొడిలో కలిపి వాడుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
గుమ్మడి తొక్కలతో కరకరలాడే చిప్స్: గుమ్మడికాయ తొక్కలు, విత్తనాలు అత్యంత పోషక విలువలు కలిగినవి. కేరళలో వీటిని ఎండబెట్టి నిల్వ చేయడం ఒక ప్రాచీన సంప్రదాయం. గుమ్మడి తొక్కలను ఉప్పు, కారం, మసాలాలు కలిపి నూనెలో వేయించినా లేదా ఎయిర్ ఫ్రైయర్‌లో బేక్ చేసినా రుచికరమైన చిప్స్ తయారవుతాయి. వీటిని సూప్‌ల పైన గార్నిష్‌గా కూడా వాడవచ్చు.

4 / 5
ఉల్లిపొట్టుతో బట్టలకు సహజ రంగులు: వంటలో వాడే ఉల్లిపాయ పొట్టుతో బట్టలకు రంగు వేయవచ్చని మీకు తెలుసా? ఉల్లిపొట్టును నీటిలో వేసి బాగా మరిగిస్తే ముదురు నారింజ రంగు ద్రావణం వస్తుంది. ఇందులో పత్తి బట్టలను నానబెట్టడం వల్ల వాటికి అందమైన రంగు వస్తుంది. ఉల్లిపొట్టులో ఉండే టానిన్ రంగు బట్టలకు గట్టిగా అంటుకోవడానికి సహాయపడుతుంది.

5 / 5
Follow Us
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..

ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా

నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!

వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!

మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?

కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..

విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌

ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు

బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది: జబర్దస్త్ అవినాష్