ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్స్ పెంచుకుంటున్నారు. కానీ వాటిని సరైన పద్ధతిలో ఎలా పెంచాలో చాలా మందికి తెలియదు.
మనీ ప్లాంట్
దీని వల్ల రోజూ నీళ్లు పోస్తున్నా కూడా ఆకులు చిన్నవిగా ఉండటం, త్వరగా వాడిపోవడం జరుగుతుంది. కాబట్టి మనీ ప్లాంట్ మంచిగా పెరగాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం.
సరిగ్గా పెంచడం
మనీ ప్లాంట్‌కు వెలుతురు అవసరం కానీ.. దాన్ని ఎప్పుడూ నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో పెట్టరాదు. ఇలా పెడితే ఎండకు ఆకులు వాడిపోవచ్చు. కాబట్టి కిటికీ పక్కన గాలి, వెలుతురు వచ్చే చోట ఉంచండి.
ఎండ తగలకుండా
చాలా మంది ఎక్కువ నీరు పోస్తే మొక్క త్వరగా పెరుగుతుందనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల వేర్లు కుళ్లిపోతాయి. కుండీలోని మట్టి పైభాగం పొడిగా మారినప్పుడు మాత్రమే నీళ్లు పోయడం మంచిది.
రోజూ నీళ్లు వద్దు
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ స్లోగా పెరుగుతుంటే దానికి కొద్దిగా సేంద్రీయ ఎరువు వేయండి. ఇలా చేస్తే మొక్క త్వరగా పెరుగుతుంది.
సరైన ఎరువు
మనీ ప్లాంట్ అనేది పైకి పాకే లక్షణం ఉన్న మొక్క. కాబట్టి దీనికి సపోర్ట్‌గా ఒక పోల్ లేదా పెద్ద కర్రను పాతి ఉంచండి.
తీగ పైకి
మనీ ప్లాంట్‌కు అతి చల్లదనం అస్సలు పడదు. కాబట్టి ఏసీ నుండి వచ్చే చల్లని గాలి నేరుగా తగిలే చోట ఈ మొక్కను ఉంచకండి.
ఏసీ గాలి వద్దు
మీ మనీ ప్లాంట్‌కు ఆకులు లేకుండా తీగ మాత్రమే పొడవుగా ఉండి బలహీనపడితే దాన్ని వెంటనే కత్తిరించండి. దీనివల్ల కొత్త చిగుర్లు త్వరగా వస్తాయి. వాటితో కొత్త మొక్కలూ పెంచవచ్చు.
ఎండిన తీగలు
మీ మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే కేవలం నీరు మాత్రమే కాదు.. సరైన వెలుతురు, తగినంత నీరు, గాలి ఉండాలి. ఇవన్నీ సరిగ్గా మెయింటెయిన్ చేస్తే కొన్ని రోజుల్లోనే మొక్క ఏపుగా పెరుగుతుంది.