పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే పాపమే..

samatha

23 November 2026

Pic credit - Pinterest

కార్తీక పౌర్ణమి వచ్చేసింది. నవంబర్ 25 కార్తీక పౌర్ణమి ఈ రోజు ప్రతి ఒక్కరూ శివకేశవులను ఆరాధించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

కార్తీక పౌర్ణమి

అయితే పౌర్ణమి, అమావాస్యలకు కొన్ని నియమాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు తప్పకుండా కొన్ని పనులు చేయకూడదు అంటారు. అవి ఏవో చూసేద్దాం.

చేయకూడని పనులు

పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామస ఆహారాలను అస్సలు తినకూడదు అని చెప్తారు మన పెద్దవారు.

ఉల్లి వెల్లుల్లి

అదే విధంగా పౌర్ణమి రోజున ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదంట. ముఖ్యంగా  కోపంతో అరవకూడదు, ఇతరులను తిట్టకూడదు, బాధ పెట్టకూడదంట.

గొడవ

చాలా మంది ఈరోజు తకు నూనె రాసుకొని స్నానం చేస్తుంటారు. అయితే పౌర్ణమి రోజు తలంటు స్నానం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెబుతున్నారు నిపుణులు.

తలంటు స్నానం

అంతే కాకుండా ఈరోజు క్షవరం చేయించుకోవడం, గోల్లు కత్తిరించడం వంటి పనులు చేయడం మంచిదికాదు, ఇది మహాపాపం అని కూడా చెబుతున్నారు పండితులు.

క్షవరం

అలాగే పౌర్ణమి రోజున ఇంటిలో దీపం వెలిగించకుండా ఉండకూడదంట. ఇంట్లో దీపం వెలిగించకుండా శుభ్రం చేయకుండా ఉండటం వలన సమస్యలు వస్తాయంట.

దీపం వెలిగించకూడదు

అదే విధంగా ఈ రోజు ఇతరులకు అప్పు ఇవ్వడం కానీ, ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం కూడా చేయకూడదు, ఉప్పు, పాలు బయటపారవేయకూడదంట.

అప్పు ఇవ్వడం తీసుకోవడం