పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?

samatha

14 November 2026

Pic credit - Pinterest

ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు దాగున్నాయి. భూ ప్రపంచంపై అనేక రకాల పక్షులు ఉన్నాయి. అందులో కొన్ని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తుంటాయి.

ప్రకృతి

ముఖ్యంగా చూడటానికి చెట్టులా కనిపించే పక్షి గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా మంది దానిని చూస్తే చాలు చెట్టు అనుకుంటారు.

చెట్టులా కనిపించే పక్షి

కానీ ఇది ఓ రహస్య పక్షి,  పగలైతే చెట్టులా నటించి, రాత్రి అయితే దెయ్యంలా మారిపోయి, వేటాడటం మొదలు పెడుతుంది.

ఓ రహస్య పక్షి

ఇంతకీ ఆ పక్షి ఏదో తెలుసా? పోటు పక్షి. ఇది పూర్తిగా చెట్టు కొమ్మలా, విరిగిన కొమ్మలా నిశ్చలంగా నిలబడి ఉండి వేటాడే జంతువులకు కనబడకుండా ఉంటుంది.

పోటు పక్షి

 ఈ పక్షి కనురెప్పలకు చిన్న చిన్న చీలికలు ఉంటాయి. కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ, ఆ చీలికల ద్వారా తన చుట్టూ ఏం జరుగుతుందో స్పష్టంగా చూడగలదు.

కనురెప్పల్లో చీలికలు

అలాగే దీని శరీరం చిన్నదైనప్పటికీ, దాని నోరు చాలా పెద్దదిగా తెరవగలదు. రాత్రి పూట ఎగిరే కీటకాలను, పురుగులను సులభంగా పట్టుకోవడానికి ఇది సహాయపడుతుంది.

పెద్ద నోరు

అయితే, ఈ పక్షికి దెయ్యం పక్షి అని పేరు రావడానికి కారణం దాని రాత్రిపూట అరుపులు. మనుషులు పెద్దగా ఏడుస్తున్నట్లు లేదా మూలుగుతున్నట్లు వింతగా వినిపిస్తాయి.

దెయ్యం పక్షి

అందుకే దక్షిణ అమెరికాలోని గ్రామీణ ప్రజలు దీనిని అడవిలో తిరిగే ఆత్మ అని నమ్ముతారు. పోటూ పక్షులు గూళ్లు కట్టవు.

దక్షిణ గ్రామీణ ప్రాంతాలలో

 విరిగిన కొమ్మపై ఒక చిన్న చీలికలో గుడ్డు పెట్టి, కొమ్మలాగే నిలబడి దాన్ని రక్షిస్తాయి. ప్రకృతిలోని ఈ వింత పక్షి రహస్యాలు నిజంగా అద్భుతమనే చెప్పాలి

విరిగిన కొమ్మపై