డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?

samatha

27 october 2026

Pic credit - Pinterest

ప్రకృతిలో ఎన్నో వింతలు, వినోదాలు దాగి ఉంటాయి. అవి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తుంటాయి. సోషల్ మీడియా వచ్చాక చాలా మంది ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటున్నారు.

వింతలు

పక్షుల గురించి చాలా మందికి తెలుసు, భూ ప్రపంచంపై ఎన్నో రకాల రంగు రంగుల పక్షులు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి.

పక్షులు

అయితే అన్నింటికంటే ఒక పక్షి మాత్రం చాలా వింతైనది. ఎందుకంటే? అది ఏకంగా సివిల్ ఇంజనీర్‌లా డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మిస్తుందంట. దాని గురించి తెలుసుకుందాం.

డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం

దక్షిణ అమెరికాకు చెందిన రూఫస్ హార్నెరో తన మట్టి గూడు నిర్మాణంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. తడి మట్టి, గడ్డితో బలమైన, ఓవెన్ ఆకారపు గూడును నిర్మిస్తుంది.

రూఫస్ హార్నెరో

 ఈ గూడు లోపల ప్రవేశ ద్వారం, గూడు గది వేరుగా ఉండటంతో రెండు గదుల ఇంటిని, అంటే డబుల్ బెడ్ రూమ్ ఇంటిని పోలి ఉంటుంది. ఇది ప్రకృతి సహజమైన ఇంజనీరింగ్‌కు అద్భుత నిదర్శనం.

రెండు గదులు

బయట నుండి చూసినప్పుడు ఈ గూడు ఒక చిన్న మట్టి కోటలా కనిపిస్తుంది. కానీ అసలు ఆశ్చర్యం దాని లోపలి నిర్మాణంలో దాగి ఉంది. హార్నెరో పక్షి తన గూడును రెండు భాగాలుగా విభజిస్తుంది

మట్టి కోట

ప్రవేశ ద్వారం, ప్రధాన గూడు . ఈ రెండు భాగాలు ఒకదానికొకటి వేరుగా ఉండేలా నిర్మిస్తుంది. ఇది దాని పిల్లలను వేటాడే జంతువుల నుంచి రక్షించడానికి ఇలా నిర్మిస్తుంది.

వేరు వేరు గదులు

హార్నెరో  వాతావరణ మార్పులను తట్టుకునేలా, బలమైన  ఇంటిని నిర్మించడానికి కనబరిచే నైపుణ్యం, ఓర్పు ప్రకృతిలోని అద్భుత సృష్టికి నిదర్శనం.

వాతావరణ మార్పులు తట్టుకునేలా నిర్మాణం