ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
Samatha
18 september 2026
Pic credit - Pinterest
కోతుల గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకప్పుడు అడవుల్లో, చెట్లు ఉండే చోట ఇవి ఎక్కువగా ఉండేవి.
కోతులు
కానీ ఇప్పుడు ఏకంగా ప్రజలు నివసించే చోటుకు వచ్చేసి ఆగం ఆగం చేస్తున్నాయి. అయితే కోతులకు సంబంధించిన అనేక అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి.
నివాస ప్రాంతాలు
చాలా వరకు అది మనిషి మాదిరిగానే కొన్ని పనులు చేస్తుంటుంది. అయితే మనం చాలా వరకు కోతులు స్నానం చేయడం కొన్ని చోట్లో చూస్తాం కానీ అది చాలా తక్కువ.
స్నానం
కానీ ఒక దేశంలో కోతులు ఎప్పుడూ వేడి నీటితో స్నానం చేస్తాయంట. ఏంటీ కోతులు వేడి నీటితో స్నానం చేయడం ఏంటీ? అని ఆశ్యర్యపోతున్నారా? కానీ ఇదే నిజం.
వేడి నీటి స్నానం
ఒక దేశంలో మనుషులు మాత్రమే కాకుండా కోతులు కూడా చలి నుంచి తప్పించుకోవడానికి ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేస్తాయంట. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ప్రతి రోజూ స్నానం
కానీ జపాన్‌లోని నగానో ప్రాంతంలో కనిపించే మంచు కోతులు చలి నుంచి తప్పించుకోవడానికి వేడి నీటిలో స్నానం చేస్తాయంట. అంతే కాకుండా చలికాలంలో గంటల తరబడి వెచ్చటి నీటిలో విశ్రాంతి తీసుకుంటాయంట.
జపాన్
నాగానో లోని Jigokudani Monkey Park లో ఇవి ప్రసిద్ధి. అక్కడ చలికాలంలో -20°C వరకు మంచు కురుస్తుంది.ఈ చలి నుండి తప్పించుకోవడానికి ఈ కోతులు వేడి నీటి బుగ్గల్లో స్నానం చేస్తాయంట
చలి
అంతే కాకుండా ఈ పార్కు జపాన్‌లో పెద్ద పర్యాటక ప్రాంతంగా మారిపోయిందంట. రోజుకు 500 మంది కేవలం కోతులు స్నానం చేయడం చూడటానికే వస్తారంట.