సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
Samatha
24 August 2026
సూర్యుడు అస్తమించడం, ఉదయించడం సహజం. అయితే చాలా మంది ప్రతి చోట సూర్యుడు అస్తమిస్తూ ఉదయిస్తూ ఉంటాడు అనుకుంటారు. కానీ ఏడు చోట్ల సూర్యుడు రాత్రి కూడా ప్రకాశిస్తాడంట. అవి ఏవి అంటే?
నార్వే, దీనిని అర్ధరాత్రి సూర్యుని దేశం అని కూడా పిలుస్తారు. ఆర్కిటికా వలయానికి పైన ఉన్నందున, ట్రోమోస్, స్వాల్బార్డ్ వంటి ప్రాంతాలలో ముఖ్యంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సూర్యుడు అస్తమించడు.
ఐస్ లాండ్, ఇక్కడ కూడా వేసవిలో మాత్రమే సూర్యుడు కొద్దిగా అస్తమిస్తాడు కానీ, ఎప్పుడూ ఉదయించి, ప్రకాశవంతంగా ఉంటాడు.
ఫిన్లాండ్.. ఉత్తర ఫిన్లాండ్‌లోని లాప్లాండ్ ప్రాంతాలలో మే నుంచి ఆగస్టు వరకు దాదాపు సూర్యుడు రాత్రి సమయంలో కూడా ప్రకాశవంతంగా ఉంటాడు.
స్వీడన్, స్వీడన్ ఉత్తర ప్రాంతంలోని ముఖ్యంగా కిరునాలో కొన్ని వారాల పాటు సూర్యుడు అస్తమించడు, ఈ సమయంలో ప్రజలు మిడ్ సమ్మర్ ఫెస్టివల్ జరుపుకుంటారు.
అలాస్కా.. అమెరికాలోని అలస్కా రాష్ట్రపు ఉత్తర భాగంలో సూర్యుడు సుమారు 80 రోజుల పాటు అస్తమించకుండా ఉంటాడంట.
కెనడా..సునావుట్, యాకాన్ వంటి కెనెడియన్ భూభాగాలలో కూడా వేసవి కాలంలో కొన్ని వారాల పాటు సూర్యుడు అస్తమించకుండా ఉంటాడంట.
అంటార్కిటికా.. ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం ఉన్నప్పుడు అంటార్కిటికాలో తీవ్రమైన శీతాకాలం ఉంటుంది. అప్పుడు ఇక్కడ మార్చి వరకు సూర్యుడు అస్తమించడంట.