AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల చక్రతీర్థం.. ఇక్కడ స్వయంభువుగా వెలసిన సుదర్శన చక్రం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Tirumala Chakra Theertham History Telguu: తిరుమలలోని పవిత్ర తీర్థాల్లో చక్రతీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన సుదర్శన చక్రత్తాళ్వారు, పురాతన శివలింగం, లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు విశేష ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్కంద పురాణంలో పేర్కొన్న ఈ తీర్థం వెనుక ఆసక్తికరమైన పురాణ కథ, దీని ఆధ్యాత్మిక విశిష్టత గురించి తెలుసుకుందాం.

Tirumala: తిరుమల చక్రతీర్థం.. ఇక్కడ స్వయంభువుగా వెలసిన సుదర్శన చక్రం ప్రత్యేకత ఏంటో తెలుసా?
Tirumala Chakra Theertham History Telguu
Rajashekher G
|

Updated on: Nov 24, 2026 | 1:10 PM

Share

Tirumala Chakra Theertham History Telguu: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల దివ్యక్షేత్రంలో అనేక పవిత్ర తీర్థాలు ఉన్నాయి. వీటిలో చక్రతీర్థానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శేషాచల కొండల్లో పచ్చని ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ పవిత్ర తీర్థం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. శ్రీవారి దర్శనం అనంతరం చాలామంది భక్తులు చక్రతీర్థాన్ని సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి దక్షిణ భాగంలో చక్రతీర్థం కొలువై ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుద్ధ ద్వాదశి రోజున ఇక్కడ చక్రతీర్థ ముక్కోటి వేడుకను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఆలయం నుంచి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వేంచేస్తారు. అక్కడ వెలసిన శ్రీ చక్రత్తాళ్వారు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ఆంజనేయస్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు.

చక్రతీర్థంలో అభివృద్ధి పనులు

భక్తుల సౌకర్యార్థం టీటీడీ చక్రతీర్థంలో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడుతోంది. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 6 వేల మంది, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో 30 వేల మంది వరకు భక్తులు ఈ తీర్థాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడ పురాతన పాలరాతి శివలింగం, లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామివారి విగ్రహాలతో పాటు స్వయంభువుగా వెలసిన సుదర్శన చక్రత్తాళ్వారు రూపం భక్తులకు దర్శనమిస్తుంది.

చక్రతీర్థం పౌరాణిక నేపథ్యం

స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చిన శంఖు, చక్ర, గదాధారియైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై కల్పాంతం వరకు అక్కడే పూజలు చేయాలని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యారు.

ఆ తర్వాత ఒక రాక్షసుడు పద్మనాభ మహర్షిని భక్షించేందుకు ప్రయత్నించగా, ఆయన స్వామివారిని ప్రార్థించారు. దీంతో శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని పంపించి రాక్షసుడిని సంహరించారు. ఆ సుదర్శన చక్రం అక్కడే ఉండి భక్తులకు రక్షణ కల్పించాలని మహర్షి కోరడంతో స్వామివారు అంగీకరించినట్లు పురాణ కథనం. అప్పటి నుంచి ఈ ప్రాంతం చక్రతీర్థంగా ప్రసిద్ధి చెందింది.

వరాహ పురాణం ప్రకారం శేషగిరుల్లో ఉన్న 66 కోట్ల తీర్థాల్లో అత్యంత పవిత్రమైన సప్త తీర్థాల్లో చక్రతీర్థం కూడా ఒకటిగా పేర్కొనబడింది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు ఈ పవిత్ర తీర్థాన్ని దర్శించుకోవడం విశేషంగా భావిస్తారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పౌరాణిక అంశాలు హిందూ పురాణాలు, మత విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. భక్తుల ఆధ్యాత్మిక అవగాహన కోసం మాత్రమే ఈ వివరాలు ప్రచురించబడ్డాయి.)

Follow Us
ఎన్నికల బరిలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్ధికి నాలుగు నెలల జైలు శిక్ష
ఎన్నికల బరిలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్ధికి నాలుగు నెలల జైలు శిక్ష
తిరుమల చక్రతీర్థం.. ఇక్కడ స్వయంభువుగా వెలసిన సుదర్శన చక్రం..
తిరుమల చక్రతీర్థం.. ఇక్కడ స్వయంభువుగా వెలసిన సుదర్శన చక్రం..
కుర్రాళ్లు ఈ పాట పాడితే ఏ అమ్మయినా పడిపోవాల్సిందే..
కుర్రాళ్లు ఈ పాట పాడితే ఏ అమ్మయినా పడిపోవాల్సిందే..
బయట కొనాల్సిన పనిలేదు.. కరకరలాడే పప్పు చేగోడీలు ఇలా చేయండి!
బయట కొనాల్సిన పనిలేదు.. కరకరలాడే పప్పు చేగోడీలు ఇలా చేయండి!
ఒకే ఓవర్‌లో 30 రన్స్‌.. పరువు తీసేసిన కోహ్లీ దోస్త్..!
ఒకే ఓవర్‌లో 30 రన్స్‌.. పరువు తీసేసిన కోహ్లీ దోస్త్..!
మీ బ్యాంక్ అకౌంట్‌లో ఈ ఆప్షన్ ఉందా? వడ్డీ ఎక్కువ పొందోచ్చు
మీ బ్యాంక్ అకౌంట్‌లో ఈ ఆప్షన్ ఉందా? వడ్డీ ఎక్కువ పొందోచ్చు
2వ టెస్ట్‌కు ముందే షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్..?
2వ టెస్ట్‌కు ముందే షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్..?
డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!
డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!
మీ విలువ గుర్తించని వారి కోసం ఎందుకు ఆరాటపడాలి? ఈ కథ చదవండి
మీ విలువ గుర్తించని వారి కోసం ఎందుకు ఆరాటపడాలి? ఈ కథ చదవండి
ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలం.. పెసరపప్పు కిచిడీ ఇలా చేస్తే..
ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలం.. పెసరపప్పు కిచిడీ ఇలా చేస్తే..