AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Purnima: జ్వాలా తోరణం దర్శనం చేస్తే నరకబాధలు ఉండవా? కాకార్తీ పౌర్ణమి రోజు దీని ప్రాముఖ్యత తెలుసా?

Karthika Purnima 2026 Jwala Thoranam Significance: కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో నిర్వహించే జ్వాలా తోరణం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి. ఈ తోరణాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? దాని కింద నుంచి భక్తులు ఎందుకు వెళ్తారు? దర్శనం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం.

Karthika Purnima: జ్వాలా తోరణం దర్శనం చేస్తే నరకబాధలు ఉండవా? కాకార్తీ పౌర్ణమి రోజు దీని ప్రాముఖ్యత తెలుసా?
Karthika Purnima 2026 Jwala Thoranam Significance
Rajashekher G
|

Updated on: Nov 24, 2026 | 9:57 AM

Share

Karthika Purnima 2026 Jwala Thoranam Significance: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున శివాలయాల్లో దీపారాధనలు, ప్రత్యేక పూజలతో పాటు జ్వాలా తోరణం అనే విశిష్టమైన అగ్ని ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కార్తిక పౌర్ణమి సాయంత్రం జరిగే ఈ వేడుకను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, జ్వాలా తోరణం కింద నుంచి వెళ్లడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన జ్వాలా తోరణం వెనుక ఉన్న పురాణ గాథలు, ఆచారాలు, విశిష్టత గురించి తెలుసుకుందాం.

జ్వాలా తోరణం ఎప్పుడు నిర్వహిస్తారు?

తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున శివాలయాల్లో జ్వాలా తోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 2026లో నవంబర్ 24, మంగళవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆలయాల్లో ఈ వేడుక జరగనుంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తిక మాసంలో జరిగే ఈ ఉత్సవాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివెళ్తారు.

జ్వాలా తోరణం వెనుక ఉన్న పురాణ గాథలు

జ్వాలా తోరణం నిర్వహణ వెనుక ప్రధానంగా రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

  • త్రిపురాసుర సంహారం: పురాణాల ప్రకారం, పరమశివుడు కార్తీక పౌర్ణమి రోజున త్రిపురాసురులను సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించాడు. ఈ విజయానికి గుర్తుగా ఈ రోజును త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. యుద్ధం ముగించుకుని వచ్చిన శివుడికి దిష్టి తగలకుండా పార్వతీదేవి జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. ఈ కారణంగానే ఈ వేడుకను నిర్వహించే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు.
  • హాలాహలాన్ని స్వీకరించిన శివుడు: క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన హాలాహల విషాన్ని లోకకల్యాణం కోసం శివుడు స్వీకరించాడు. ఆ విషం తన కంఠంలోనే నిలిచిపోయేలా చేసుకుని నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ ఘట్టం అనంతరం శివపార్వతులు జ్వాలా తోరణం గుండా మూడుసార్లు వెళ్లినట్లు మరో పురాణ కథనం చెబుతోంది.

జ్వాలా తోరణం ఎలా నిర్వహిస్తారు?

కార్తిక పౌర్ణమి సాయంత్రం శివాలయ ప్రాంగణంలో రెండు ఎత్తైన కర్రలను నిలబెట్టి, వాటి పైభాగాలను మరో కర్రతో కలుపుతారు. అడ్డంగా ఏర్పాటు చేసిన కర్రకు ఎండుగడ్డిని చుట్టి నిప్పంటిస్తారు. అలా అగ్నిజ్వాలలతో వెలిగే తోరణాన్నే జ్వాలా తోరణం అంటారు. ముందుగా శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ ఈ తోరణం కింద నుంచి మూడుసార్లు దాటిస్తారు. అనంతరం భక్తులు కూడా భక్తిశ్రద్ధలతో దాని కింద నుంచి వెళ్తారు.

జ్వాలా తోరణ దర్శనంతో కలిగే ఫలితాలు

జ్వాలా తోరణాన్ని దర్శించడం, దాని కింద నుంచి వెళ్లడం వల్ల పాపాలు తొలగి, ఆరోగ్యం, ఆయుష్షు, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అపమృత్యు దోషాలు తొలగుతాయని, నరకబాధలు ఉండవని పురాణ విశ్వాసాలు పేర్కొంటున్నాయి. అలాగే జ్వాలా తోరణం నుంచి లభించే భస్మాన్ని పవిత్రంగా భావించి ధరించే సంప్రదాయం కూడా ఉంది. అందుకే కార్తిక పౌర్ణమి రోజున శివాలయాలను సందర్శించి జ్వాలా తోరణాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పురాణ గాథలు, ఆధ్యాత్మిక విశేషాలు హిందూ మత సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని మతపరమైన నమ్మకాలుగానే పరిగణించాలి.)

Follow Us
జ్వాలా తోరణం దర్శనం చేస్తే నరకబాధలు ఉండవా? కాకార్తీ పౌర్ణమి రోజు
జ్వాలా తోరణం దర్శనం చేస్తే నరకబాధలు ఉండవా? కాకార్తీ పౌర్ణమి రోజు
కార్తీక పౌర్ణమి స్పెషల్.. పచ్చి పసుపు అన్నం.. తింటే దగ్గు మాయం
కార్తీక పౌర్ణమి స్పెషల్.. పచ్చి పసుపు అన్నం.. తింటే దగ్గు మాయం
గిల్ కాదా.. సచిన్‌కు కూతురు పెళ్లి చేసుకోబోయేది ఎవరినంటే?
గిల్ కాదా.. సచిన్‌కు కూతురు పెళ్లి చేసుకోబోయేది ఎవరినంటే?
డింపుల్‌కు పెళ్లయిపోయిందా? స్వయంగా క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్
డింపుల్‌కు పెళ్లయిపోయిందా? స్వయంగా క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్
ఇందిమ్మ బీమా పథకంలో నమోదు చేసుకునేవారికి అలర్ట్..
ఇందిమ్మ బీమా పథకంలో నమోదు చేసుకునేవారికి అలర్ట్..
కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటి? 365 వత్తులతో దీపారాధన ఎందుకు..
కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటి? 365 వత్తులతో దీపారాధన ఎందుకు..
పూణేలో దారుణం.. ప్రియురాలిని కొట్టి చంపిన ప్రియుడు..
పూణేలో దారుణం.. ప్రియురాలిని కొట్టి చంపిన ప్రియుడు..
మిర్చి బజ్జీలు వేసిన హీరో.. వీడియో వైరల్!
మిర్చి బజ్జీలు వేసిన హీరో.. వీడియో వైరల్!
హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. తోపు ప్లేయర్ రెడీ..!
హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. తోపు ప్లేయర్ రెడీ..!
ఖరీదైన లిప్‌బామ్స్‌ వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.
ఖరీదైన లిప్‌బామ్స్‌ వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.