AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ వీధుల్లో విజయ్ ఆంటోనీ సందడి.. మిర్చి బజ్జీలు వేసిన హీరో.. వీడియో వైరల్!

సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి బజ్ తీసుకురావడానికి హీరోలు రకరకాల ప్రచార వ్యూహాలను అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్లతో పాటు నేరుగా ప్రజల్లోకి వెళ్లి తమ సినిమాలను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు విజయ్ ఆంటోనీ ఎంచుకున్న వినూత్న ప్రచార పద్ధతి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

హైదరాబాద్ వీధుల్లో విజయ్ ఆంటోనీ సందడి.. మిర్చి బజ్జీలు వేసిన హీరో.. వీడియో వైరల్!
Vijay Antony
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2026 | 9:21 AM

Share

సినిమా ప్రమోషన్స్ అంటే సాధారణంగా ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు గుర్తొస్తాయి. కానీ కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ మాత్రం ప్రమోషన్స్‌లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి వినూత్నమైన మార్గాలను ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆయన చేసిన సందడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ‘అప్పా కుట్టి’ చిత్రాన్ని తెలుగులో ‘నాన్న కుట్టి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ఈ నెల 27 నుంచి తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

సినిమా విడుదలకు సమయం దగ్గరపడటంతో విజయ్ ఆంటోనీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇటీవల రైలులో సాధారణ ప్రయాణికుల మధ్య జనరల్ బోగీలో ప్రయాణిస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎలాంటి హంగామా లేకుండా సామాన్యుడిలా ప్రయాణించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇక తాజాగా హైదరాబాద్‌లోనూ తనదైన స్టైల్లో ప్రమోషన్స్ నిర్వహించారు. హీరోయిన్ ప్రీతి అస్రానితో కలిసి నగర వీధుల్లో సందడి చేశారు. అంతేకాదు.. ఓ మిర్చి బండి దగ్గరకు వెళ్లి స్వయంగా బజ్జీలు తయారు చేసి అక్కడున్న వారికి అందించారు. హీరోను ఇలా  చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈరోజు హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కూడా ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో ‘నాన్న కుట్టి’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే వినూత్న ప్రమోషన్స్‌తో వార్తల్లో నిలుస్తున్న విజయ్ ఆంటోనీ.. తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ద్వారా ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us