AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతీయ అందాల పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి సత్తా.. స్టార్ మిస్ టీన్ ఇండియా 2026లో రిషితకు ఫస్ట్ రన్నరప్ కిరీటం!

అందాల పోటీల్లో తెలుగు అమ్మాయిలు తమ ప్రతిభను చాటుకుంటూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన యువతి రిషిత పెన్మెత్స అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్టార్ మిస్ టీన్ ఇండియా 2026 అందాల పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

జాతీయ అందాల పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి సత్తా.. స్టార్ మిస్ టీన్ ఇండియా 2026లో రిషితకు ఫస్ట్ రన్నరప్ కిరీటం!
Rishitha Penumetcha
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2026 | 7:39 AM

Share

అందాల పోటీల్లో తెలుగు అమ్మాయిలు తమ ప్రతిభను చాటుకుంటూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన యువతి రిషిత పెన్మెత్స అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్టార్ మిస్ టీన్ ఇండియా 2026 అందాల పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. జైపూర్‌లో మీడియా సంస్థ వేదికగా జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న మొత్తం 31 మంది కంటెస్టెంట్లు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరందరినీ అధిగమిస్తూ రిషిత ఫస్ట్ రన్నరప్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల రిషిత పెన్మెత్స ప్రస్తుతం ఒబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు అందాల పోటీలపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. జాతీయ స్థాయి వేదికపై తన ప్రతిభను నిరూపించుకుంది. చిన్న వయసులోనే ఇలాంటి ప్రతిష్టాత్మక పోటీలో విజయం సాధించడం ఆమె ఆత్మవిశ్వాసానికి, కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఒక తెలుగు అమ్మాయి జాతీయ స్థాయి అందాల పోటీల్లో రన్నరప్‌గా నిలవడం హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా మారింది. ఈ విజయంతో రిషితకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది.

ఇక రిషిత ప్రయాణం ఇక్కడితో ఆగిపోవడం లేదు. త్వరలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి అందాల పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆమెకు దక్కనుంది. దీంతో అంతర్జాతీయ వేదికపై కూడా తన ప్రతిభను చాటుకునేందుకు రిషిత సిద్ధమవుతోంది. మొత్తానికి చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ అమ్మాయి రిషిత పెన్మెత్స.. అంతర్జాతీయ పోటీల్లోనూ విజయం సాధించి దేశానికి మరింత పేరు తీసుకురావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్టార్ మిస్ టీన్ ఇండియా 2026లో రిషితకు ఫస్ట్ రన్నరప్ కిరీటం!
స్టార్ మిస్ టీన్ ఇండియా 2026లో రిషితకు ఫస్ట్ రన్నరప్ కిరీటం!
రైతన్నల బలం సీక్రెట్.. అరటికాయ ఆవ కూర.. పుల్లగా భలే రుచిగా..
రైతన్నల బలం సీక్రెట్.. అరటికాయ ఆవ కూర.. పుల్లగా భలే రుచిగా..
వాతావరణశాఖ హెచ్చరిక.. బంగాళాఖాతంలో 2 తుపాన్ల ముప్పు..!
వాతావరణశాఖ హెచ్చరిక.. బంగాళాఖాతంలో 2 తుపాన్ల ముప్పు..!
యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? ఆర్బీఐ కొత్త రూల్స్..
యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? ఆర్బీఐ కొత్త రూల్స్..
ఈ ఇద్దరిలో ఒకడు ఉంటే తొలి టెస్ట్ గెలిచేవాళ్లం..
ఈ ఇద్దరిలో ఒకడు ఉంటే తొలి టెస్ట్ గెలిచేవాళ్లం..
బొగ్గుల మీద కాల్చే చేప కూర.. ఒక్కసారి తింటే, ఆహా అనాల్సిందే
బొగ్గుల మీద కాల్చే చేప కూర.. ఒక్కసారి తింటే, ఆహా అనాల్సిందే
ఇంటర్ పాసైనవారికి అలర్ట్.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు
ఇంటర్ పాసైనవారికి అలర్ట్.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు
థియేటర్లలో భోగి.. ఓటీటీల్లో దృశ్యం 3 టు హనుమాన్ అంశ్
థియేటర్లలో భోగి.. ఓటీటీల్లో దృశ్యం 3 టు హనుమాన్ అంశ్
తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే
తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే
టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల మంజూరు ఆన్‌లైన్‌లోనే! విద్యాశాఖ
టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల మంజూరు ఆన్‌లైన్‌లోనే! విద్యాశాఖ