AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల మంజూరు ఆన్‌లైన్‌లోనే! కీలక ఉత్తర్వులు

టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. ఇకపై సెలవుల మంజూరుతో పాటు ఇంక్రిమెంట్లు, ఈపీజీఎఫ్‌, ఈ-పెన్షన్‌ వంటి సర్వీసు వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. IFMIS పోర్టల్‌లోని EHRMS మాడ్యూల్ ద్వారా ఈ ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల మంజూరు ఆన్‌లైన్‌లోనే! కీలక ఉత్తర్వులు
TG Teachers Leave Rules
Srilakshmi C
|

Updated on: Nov 24, 2026 | 6:52 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 24: ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. టీచర్ల సెలవుల మంజూరు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై ఉపాధ్యాయులు, ఉద్యోగుల సెలవుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (IFMIS) పోర్టల్‌లోని ఈహెచ్‌ఆర్‌ఎంఎస్ (EHRMS) మాడ్యూల్ ద్వారా ఉపాధ్యాయులు, ఉద్యోగుల సెలవుల మంజూరు ప్రక్రియను చేపట్టాలని విద్యాశాఖ సూచించింది. ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలకు బదులుగా ఆన్‌లైన్ విధానంలోనే సెలవుల దరఖాస్తులను పరిశీలించి ఆమోదించాలని స్పష్టం చేసింది.

సెలవులే కాదు.. అన్ని సర్వీసు వ్యవహారాలు ఆన్‌లైన్‌లోనే!

కేవలం సెలవుల మంజూరుకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించిన ఇతర సర్వీసు వ్యవహారాలను కూడా ఈ పోర్టల్ ద్వారానే నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఇందులో ముఖ్యంగా…

  • సెలవుల మంజూరు: అన్ని రకాల సెలవుల దరఖాస్తుల ప్రాసెసింగ్.
  • ఇంక్రిమెంట్లు: ఉద్యోగుల వార్షిక వేతన పెంపు ప్రక్రియ.
  • ఈపీజీఎఫ్ (EPGF): ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించిన వ్యవహారాలు.
  • ఈ-పెన్షన్ (e-Pension): పెన్షన్ సంబంధిత సేవలు.

ఈ అన్ని సేవలను IFMIS పోర్టల్‌లోని EHRMS మాడ్యూల్ ద్వారా ప్రాసెస్ చేయాలని సూచించింది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఉపాధ్యాయులు, ఉద్యోగుల సర్వీసు రికార్డుల నిర్వహణ మరింత సులభతరం కానుంది. దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో పారదర్శకత పెరగడంతో పాటు, ఫైళ్ల కదలిక, ఆమోద ప్రక్రియను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. అలాగే సెలవులు, ఇంక్రిమెంట్లు, పెన్షన్ వంటి అంశాలకు సంబంధించిన వివరాలు ఒకే వేదికపై అందుబాటులోకి రానున్నాయి. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలను డిజిటల్ విధానంలోకి తీసుకెళ్లే దిశగా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టీచర్లు, ఉద్యోగులు IFMIS పోర్టల్‌లోని EHRMS మాడ్యూల్‌కు సంబంధించిన విధానాలను తెలుసుకోవడం అవసరం.

Follow Us