AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పాపాలు తొలగిపోతాయని ఏనుగు విగ్రహం కింద నుంచి దూరాడు.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లో ఉన్న నర్మదా ఉద్గమ్ ఆలయంలో ఓ వింత ఆచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయంలోని రాతి ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి బయటకు వస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇరుకైన ప్రదేశం నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆచారం వెనుక ఉన్న నమ్మకం ఏమిటి? దీనిపై నెటిజన్లు ఏమంటున్నారు? తెలుసుకుందాం..

Watch: పాపాలు తొలగిపోతాయని ఏనుగు విగ్రహం కింద నుంచి దూరాడు.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్
Man Struggles To Pass Between Elephants Legs
Srilakshmi C
|

Updated on: Nov 24, 2026 | 6:23 AM

Share

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లో ఉన్న ఓ ఆలయంలో ఏర్పాటు చేసిన రాతి ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి ఓ వ్యక్తి బయటకు రావడానికి ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇరుకైన ప్రదేశం కావడంతో అతడు తీవ్రంగా ఇబ్బందిపడుతూ, నెమ్మదిగా పాకుతూ బయటకు రావడానికి ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అసలు ఎక్కడ జరిగిందంటే?

మధ్యప్రదేశ్‌లోని మైకల్ పర్వత ప్రాంతాల్లో ఉన్న అమర్‌కంటక్‌లో ప్రసిద్ధి చెందిన మా నర్మదా ఆలయం ఉంది. దీనినే నర్మదా ఉద్గమ్ ఆలయం అని కూడా పిలుస్తారు. పవిత్ర నర్మదా నది ఇక్కడే జన్మించిందని భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయంలోని రాతి ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి వెళ్లే ఆచారం చాలాకాలంగా కొనసాగుతోందని చెబుతున్నారు. ఏనుగు కాళ్ల మధ్య ఉన్న ఇరుకైన ఖాళీ నుంచి విజయవంతంగా బయటకు వస్తే పాపాలు తొలగిపోతాయని కొందరు భక్తులు నమ్ముతారు. అలాగే తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని మొక్కుకున్న వారు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ వ్యక్తి రాతి ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి బయటకు రావడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. ఖాళీ చాలా ఇరుకుగా ఉండటంతో అతడు ముందుకు కదలలేక ఇబ్బందిపడ్డాడు. పాకుతూ, శరీరాన్ని అటూ ఇటూ తిప్పుతూ బయటకు రావడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పలువురు వ్యక్తులు అతడికి సూచనలు చేస్తూ ధైర్యం చెప్పారు. కంగారు పడవద్దని, నెమ్మదిగా శ్వాస తీసుకోవాలని, కొంచెం పక్కకు జరగాలని సూచించారు. శరీరాన్ని ఎలా మలుచుకుంటే బయటకు రావచ్చో కూడా వివరించారు.

ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది కొత్త ఆచారం కాదని, ఎన్నో ఏళ్లుగా భక్తులు ఇలాగే ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి ఆచారాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరుకైన ప్రదేశంలో శరీరాన్ని బలవంతంగా ఇరికించడం వల్ల గాయాలు, ఎముకలు లేదా కీళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఏనుగు విగ్రహం కింద నుంచి బయటకు రాగలిగితే పాపాల కంటే పుణ్యమే ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారని, అందుకే చాలామంది ఈ ప్రయత్నం చేస్తారని పేర్కొన్నారు. అయితే, కొందరు అక్కడ ఇరుక్కుపోవడం కూడా సాధారణమేనని వ్యాఖ్యానించారు. మరో యూజర్ స్పందిస్తూ.. ఇలాంటి ప్రయత్నాల వల్ల భవిష్యత్తులో ఎముకలు, కీళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

భక్తి, విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. అయితే ఏదైనా ఆచారాన్ని పాటించే సమయంలో ప్రాణాలకు, ఆరోగ్యానికి ప్రమాదం కలగకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఇరుకైన ప్రదేశాల్లో బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించడం ప్రమాదకరం కావచ్చు. అందుకే విశ్వాసాలను గౌరవిస్తూనే భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.

Follow Us