ఈ 5 రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ పురోగతి.. ఆకస్మిక ధనలాభం! నేటి దినఫలాలు
Today Horoscope - నవంబర్ 24, 2026 మంగళవారం దినఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి గ్రహగతులు ఎలా ఉండబోతున్నాయి? కొందరికి ఉద్యోగాల్లో పురోగతి, మరికొందరికి ఆకస్మిక ధనలాభం, వివాహ ప్రయత్నాల్లో విజయం లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగ అవకాశాల పరంగా ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

మేషం రాశి వారికి ఉద్యోగంలోనే కాక, కుటుంబంలో కూడా ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృషభం రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. అనుకో కుండా కొన్ని మంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి. మిథునం రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేషం రాశి నుంచి మీనం వరకు మంగళవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలోనే కాక, కుటుంబంలో కూడా ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఆర్థిక స్థిర త్వం కూడా లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు, బంధుమిత్రులతో మధ్య మధ్య చికాకులు తప్పకపోవచ్చు. ఆదాయపరంగా, వ్యాపారపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగావకాశాలు బాగా కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. అనుకో కుండా కొన్ని మంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఏ విషయంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక అవసరాలు చాలా వరకు తీరిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ప్రస్తుతానికి దేనికీ లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో త్వరితగతిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభాల బాటలో పురోగమిస్తాయి. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలపరంగా బాగానే ఉంటుంది కానీ, తోటి ఉద్యోగుల తీరుతెన్నులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఆదాయానికి లోటుండదు. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. మిత్రులతో కొద్దిగా సామరస్య ధోరణితో వ్యవహరించడం మంచిది. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు లాభాలను తీసుకువస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. పిల్లల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా బాగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఆరోగ్యం మీద కాస్తంత శ్రద్ధ పెట్టడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రులు కూడా సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడడం జరుగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఇంటా బయటా మీ మాటకు, చేతకు ఎదురుండదు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. సకాలంలో లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. పెళ్లి ప్రయత్నాల్లో దూరపు బంధువుల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధి స్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగాసాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులకు నమ్మకం ఏర్పడుతుంది. వ్యాపా రాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఇష్టమైన మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక శుభ కార్యంలో బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. పిల్లలు చదువుల్లో తేలికగా విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం వల్ల విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవ కాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇతరులతో మాటలు పడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటి వాటివల్ల ఆశించిన లాభాలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం చాలావరకు సామరస్యంగా సాగిపోతుంది.