Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
నవంబర్ 17 నుండి జనవరి 16 వరకు కేతువు బలం గణనీయంగా పెరుగుతుంది. రవి సంచారం సింహ రాశిలో కేతువును శక్తివంతం చేస్తుంది. దీనితో మిథునం, సింహం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఊహించని అదృష్టం, ధన లాభం, ఉద్యోగంలో పురోగతి, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తాయి. ఈ కాలం వారికి శుభ పరిణామాలు, రాజయోగాలు తెస్తుంది.
- TV9 Telugu Desk
- Updated on: Nov 13, 2025
- 7:33 pm
Wealth Astrology: రెండు అద్భుత యోగాలు… ఆ రాశులకు లంకె బిందెల భాగ్యం గ్యారంటీ!
చంద్రుడికి తులా రాశి దాదాపు ఉచ్ఛరాశితో సమానం. తులా రాశి జాతకులు సహజ యోగ జాతకులని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. అటువంటి తులా రాశిలో చంద్రుడు ఈ నెల(నవంబర్) 18, 19, 20 తేదీల్లో సంచారం చేయడం జరుగుతోంది. శుక్రుడికి స్వస్థానమైన తులా రాశిలో చంద్రుడు, శుక్రుడితో యుతి చెందడం వల్ల లక్ష్మీ యోగం కలుగుతోంది. అదే సమయంలో చంద్రుడికి దశమ కేంద్రంలో ఉచ్ఛ గురువు ఉండడం వల్ల గజకేసరి యోగం కూడా చోటు చేసుకుంటోంది. ఈ రెండు యోగాల వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి దాదాపు లంకె బిందెల భాగ్యం కలగబోతోంది. ఈ మూడు రోజుల్లో ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. తద్వారా లంకె బిందెలు స్థాయిలో మీ ఆదాయం పెరిగే అవకాశముంటుంది.
- TV9 Telugu Desk
- Updated on: Nov 13, 2025
- 7:13 pm
Rashi Phalalu: వారికి ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today (November 13, 2025): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు కలిసివస్తాయి. వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలకు లోటు ఉండకపోవచ్చు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మిథున రాశి వారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Nov 13, 2025
- 5:31 am
Property Astrology: ఈ ఏడాది చివరిలోగా..ఈ రాశుల వారికి ఆస్తిపాస్తులు గ్యారెంటీ..!
Guru-Kuja Yoga: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గురువు కర్కాటకంలో, కుజుడు వృశ్చికంలో ఉండటంతో 6 రాశుల వారికి ఈ ఏడాది చివరికల్లా స్థిరాస్తులు చేకూరనున్నాయి. వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీనం రాశుల వారికి గృహ, భూమి, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై, వారసత్వ సంపద లభించే అవకాశాలున్నాయి.
- TV9 Telugu Desk
- Updated on: Nov 12, 2025
- 6:06 pm
Lucky Zodiacs: గురు దృష్టితో ఈ రాశుల వారికి అదృష్టం పట్టడం ఖాయం..!
Telugu Astrology: ఈ నెల (నవంబర్) 12వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు గురువు తనకు ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలో వక్రించడం జరుగుతోంది. వక్రించిన గురువు కుజ, శనులను వీక్షించడం వల్ల ఈ రెండు పాప గ్రహాలు శుభ గ్రహాలుగా మారి కొన్ని రాశులకు యోగదాయకంగా మారే అవకాశం ఉంది. గురు దృష్టి ఈ గ్రహం మీద పడినా ఆ గ్రహం శుభ ఫలితాలను మాత్రమే ఇస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వక్ర గురు దృష్టి ఫలితంగా మేషం, మిథునం, సింహం, ధనుస్సు, మీన రాశుల వారు కూడా ఉన్నతస్థాయి యోగాలను అనుభవించే అవకాశం ఉంది.
- TV9 Telugu Desk
- Updated on: Nov 12, 2025
- 5:52 pm
Rashi Phalalu: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today (November 12, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు కనిపిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Nov 12, 2025
- 5:31 am
Lucky Zodia Signs: గురువుపై రవి వీక్షణ.. అదృష్టం వీరి తలుపు తట్టడం ఖాయం!
Telugu Astrology: నవంబర్ 16 నుంచి రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. ఇదే సమయంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు రవిని వీక్షించడం వల్ల 6 రాశుల వారికి అరుదైన ఆదాయ, అధికార యోగాలు పడతాయి. వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి ఉద్యోగ పదోన్నతులు, ఆర్థిక ప్రగతి, వ్యాపార వృద్ధి, విదేశీ అవకాశాలు లభించి రాజయోగం కలుగుతుంది. ఇది శీఘ్ర పురోగతికి మార్గం సుగమం చేస్తుంది.
- TV9 Telugu Desk
- Updated on: Nov 11, 2025
- 7:03 pm
Venus Transit: ఒంటరిగా శుక్ర సంచారం.. ఈ రాశులకు రాజయోగాలు, ధన యోగాలు
Shukra Gochar: ఈ నెల(నవంబర్) 16 నుంచి 23 వరకు శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో ఒంటరిగా, ఏ ఇతర గ్రహాలతోనూ సంబంధం లేకుండా సంచారం చేయడం జరుగుతోంది. ఏ గ్రహమైనా ఇతర గ్రహాలతో కలిసినప్పుడు లేదా ఇతర గ్రహాల వీక్షణ పొందుతున్నప్పుడు ఒక విధంగానూ, ఒంటరిగా ఉన్నప్పుడు మరో విధంగానూ ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. నీచ రవి ప్రభావం నుంచి శుక్రుడు బయటపడడం జరుగుతోంది. ఒంటరి శుక్రుడి వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారు రాజయోగాలు, ధన యోగాలను గరిష్ఠ స్థాయిలో అనుభవించే అవకాశం ఉంది.
- TV9 Telugu Desk
- Updated on: Nov 11, 2025
- 6:35 pm
Rashi Phalalu: ప్రయాణాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today: మేష రాశి వారు ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ, తీసుకోవడం గానీ పెట్టుకోవద్దు. ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం బాగా సానుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు, ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Nov 11, 2025
- 5:31 am
Raja Yoga: గ్రహ రాజు రవికి బలం.. ఈ రాశులవారు రారాజులు కాబోతున్నారు..!
నవంబర్ 16 నుండి డిసెంబర్ 16 వరకు గ్రహ రాజు రవి వృశ్చిక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో రవి రెట్టింపు బలంతో ఐశ్వర్యం, అధికారం ప్రసాదిస్తాడు. మిథునం, సింహం, కన్య, మకరం, కుంభ రాశులకు విపరీత రాజయోగం పడుతుంది. ఈ నెల రోజులు ఈ ఐదు రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతులు, ఆస్తి లాభం, ఆర్థికాభివృద్ధి, వివాహ శుభకార్యాలు వంటి శుభఫలితాలు కలుగుతాయి. వారి జీవితం ఆనందంగా సాగుతుంది.
- TV9 Telugu Desk
- Updated on: Nov 10, 2025
- 12:13 pm
Maha Shakthi Yoga: అనుకున్నది సాధిస్తారు..! మహా శక్తివంతులు కాబోతున్న రాశుల వారు వీరే..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏ రాశికైనా వ్యయ స్థానంలో, అంటే 12వ స్థానంలో పాప గ్రహం ఉన్న ప్పుడు మహా శక్తి యోగం కలుగుతుంది. ఎంతటి కష్టమైనా భరించి, ఎంతటి శ్రమకైనా ఓర్చి అను కున్నది సాధించడం, ఆశలు, ఆశయాలు నెరవేర్చుకోవడం ఈ మహా శక్తి యోగం ప్రత్యేకత. వ్యయ స్థానంలో శని, కుజ, రాహు, కేతు, రవి గ్రహాలున్నప్పుడు ఈ యోగం కలుగుతుంది. ప్రస్తుతం మేషం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులకు ఈ యోగం పట్టింది. ఈ యోగం వల్ల ఈ రాశుల వారు మరో నెల రోజుల్లో పట్టుదలగా, పోరాటాల ద్వారా తామనుకున్నవి సాధించుకుంటారు.
- TV9 Telugu Desk
- Updated on: Nov 10, 2025
- 11:57 am
Rashi Phalalu: ఆ రాశి ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today (November 10, 2025): మేష రాశి వారు శుభవార్తలు ఎక్కువగా ఉంటారు. ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్ని చాలావరకు చక్కబెడతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒకటి రెండు పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
- TV9 Telugu Desk
- Updated on: Nov 10, 2025
- 5:31 am