AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Progress: కుజ, రాహువుల యుతి.. ఆ రాశుల వారు జీవితంలో స్థిరపడే ఛాన్స్..!

Power and Progress: ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుంభ రాశిలో కుజ–రాహు యుతి ఏర్పడుతోంది. ఈ యుతి వల్ల అధికార, ధన, ఆస్తి ఆశలు పెరగడంతో పాటు పోరాటతత్వం, పట్టుదల, దూకుడుతనం కూడా అధికమవుతాయి. అయితే ఈ గ్రహ యుతి మేషం, వృషభం, సింహం, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించనుంది. సుమారు 40 రోజుల పాటు జీవితంలో స్థిరపడే అవకాశాలను ఆ రాశుల వారికి కల్పించనుంది.

Progress: కుజ, రాహువుల యుతి.. ఆ రాశుల వారు జీవితంలో స్థిరపడే ఛాన్స్..!
Power And Progress Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 16, 2026 | 6:28 PM

Share

Mars Rahu Conjunction 2026: ఈ నెల(ఫిబ్రవరి) 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుంభ రాశిలో కుజ, రాహువుల యుతి జరుగుతోంది. కుజ, రాహువుల యుతి వల్ల సాధారణంగా అధికార దాహం, ధన దాహం, ఆస్తి దాహం పెరుగుతాయి. వాటికి తగ్గట్టుగా పోరాటతత్వం, దౌర్జన్యం, పట్టుదల, దూకుడుతనం కూడా పెరుగుతాయి. ఈ రెండు గ్రహాల యుతి ఏ రాశులకు అనుకూలంగా ఉంటుందో ఆ రాశివారు అనేక విధాలుగా జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, సింహం, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి సుమారు 40 రోజులు యోగదాయకంగా ఉండడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, రాహువులు కలవడం అత్యంత యోగదాయకం. పట్టిందల్లా బంగారం అవుతుంది. గట్టి పట్టుదలతో నైపుణ్యాలను, ప్రతిభా వ్యుత్పత్తులను పెంచుకుని ఉద్యో గంలో పదోన్నతులు సంపాదిస్తారు. వృత్తి, వ్యాపారాల్ని కొద్ది మార్పులతో లాభాల బాటపట్టిస్తారు. కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఎంత శ్రమకైనా ఓర్చుకుని ఆదాయాన్ని పెంచుకుంటారు. వీరికి షేర్లు బాగా లాభిస్తాయి.
  2. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ, రాహువుల యుతి జరుగుతున్నందువల్ల ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు సంపాదించే అవకాశం ఉంది. పదోన్నతి, భారీ జీతభత్యాలకు అవకాశం ఉన్న మరో ఉద్యోగంలోకి మారవచ్చు. వీరి ఆధ్వర్యంలో ఏ సంస్థ అయినా శీఘ్ర పురోగతి సాధిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
  3. సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ, రాహువుల సంచారం వల్ల విదేశీ ఉద్యోగాల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో జోరు బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. ఒక సంపన్నుడి స్థాయి లభిస్తుంది.
  4. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ, రాహువుల సంచారం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. సీనియర్లను కాదని పదోన్నతులు సంపాదిస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలతో పాటు వివాదాలు, విభేదాలు కూడా పరిష్కారమవుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ప్రయాణాలు, ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు.
  5. మకరం: ఈ రాశికి ధన స్థానంలో కుజ, రాహువులు కలవడం వల్ల విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం వల్ల ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ముతో పాటు రాదనుకున్న సొమ్ము కూడా వసూలవుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశిలో కుజ, రాహువుల యుతి జరిగినందువల్ల ఈ రాశివారిలో పదోన్నతులు సాధించడం, ఆదాయాన్ని పెంచుకోవడంలో పట్టుదల పెరుగుతుంది. ఏదైనా సంస్థలో ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది. మిలిటరీ, పోలీస్, ఫైర్ సర్వీసెస్ వంటి రంగాల్లో వీరికి పదోన్నతులతో పాటు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వాద వివాదాల్లో ఘన విజయాలు సాధిస్తారు. లాయర్లు, డాక్టర్లు వంటి వృత్తుల వారు ఒక వెలుగు వెలుగుతారు.

Follow Us