ఫస్టాఫ్ యావరేజ్.. మరి సెకండాఫ్..!
ఈ ఏడాది తొలి ఐదు నెలలు టాలీవుడ్ ఆశించిన విజయాలను అందించలేకపోయింది. విడుదలైన సినిమాల సంఖ్యకు, వాటికి వచ్చిన విజయాలకు పొంతన లేకుండా పోయింది. సంక్రాంతి సీజన్‌లో ఐదు సినిమాలు విడుదల కాగా, కేవలం మూడు మాత్రమే విజయం సాధించాయి. సమ్మర్ సీజన్ విషయానికి వస్తే, ‘పెద్దే’ మినహా చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఏదీ విడుదల కాలేదు. పలువురు స్టార్ హీరోల సినిమాలు వివిధ కారణాలతో, ముఖ్యంగా ఐపీఎల్ ప్రభావంతో వాయిదా పడ్డాయి.
ఈ పరిస్థితుల్లో, టాలీవుడ్ దృష్టి ఇప్పుడు రెండో భాగంపైనే ఉంది. ఆగస్ట్ 21న రావాల్సిన నాని చిత్రం ‘ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ‘విశ్వంభర’ విడుదలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభాస్ ‘ఫౌజీ’ ఈ ఏడాది వచ్చేది కూడా అనుమానాస్పదంగానే ఉంది. దీంతో రెండో సగం ఆశలన్నీ వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ, విజయ్ దేవరకొండ చిత్రాలపై నిలిచాయి. వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ దసరాకు షిఫ్ట్ అయింది. బాలకృష్ణ-గోపీచంద్ సినిమా కూడా రానుంది. సెప్టెంబర్ 11న విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీటితో పాటు ‘సంబరాల ఏటిగట్టు’, ‘వృషకర్మ’, ‘నాగబంధం’ వంటి చిత్రాలు కూడా రెండో సగంలో విడుదల కానున్నాయి. ఈ సినిమాల విజయాలపైనే టాలీవుడ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

