బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
బాక్సాఫీస్ ఏదైనా, బయోపిక్స్ భారీగా విజయవంతమవుతున్నాయి. వాటికోసం చేయాల్సిందల్లా కాస్త ఒరిజినల్ ఫ్లేవర్ ఉండేలా, ఎమోషనల్ కథనం అందిస్తే చాలు. అలా చేసిన ప్రతీసారి బయోపిక్స్ కాసుల పంట పండించాయి. ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో బయోపిక్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు మహానటి. సావిత్రి జీవితం ఆధారంగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా, నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గానే కాకుండా అవార్డులనూ గెలుచుకుంది.
తాజాగా తెలుగులో ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ రాబోతోంది. రష్మిక మందాన ఆ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే రష్మికతో లుక్ టెస్ట్ కూడా అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా ప్రముఖ జానపద కళాకారిణి, డాన్సర్, తమాషా మహారాణిగా గుర్తింపు పొందిన విఠాబాయి నారాయణ్ గావ్‌కర్ బయోపిక్ రానుంది. ఛావాలో శంభాజీ మహారాజ్ కథని చూపించిన లక్ష్మణ్ ఊటేకర్ ఈ బయోపిక్‌ని ప్రకటించారు. దీనికి ఈఠా అనే టైటిల్ ఖరారు చేశారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో 60 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. బాలీవుడ్‌కు బయోపిక్స్ కొత్తేం కాదు. మేరీ కోమ్‌గా ప్రియాంక చోప్రా, మాఫియా క్వీన్ గంగూబాయిగా ఆలియా భట్, జయలలితగా కంగనా రనౌత్ అద్భుతంగా నటించారు. ఇక డర్టీ పిక్చర్లో సిల్క్ స్మితగా విద్యా బాలన్ నటనకు నేషనల్ అవార్డు లభించింది. ఈ బయోపిక్స్ భారతదేశ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.
మరిన్ని వీడియోల కోసం :
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

