ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం పైలట్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో దాదాపు గంట ఆలస్యంగా బయలుదేరింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పైలట్ సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు. దీంతో 175 మందికి పైగా ప్రయాణికులు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. ఎంపీ హనుమాన్ బెనివాల్ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేయగా, వర్షాలు, ట్రాఫిక్ కారణంగానే ఆలస్యమైందని ఇండిగో వివరణ ఇచ్చింది.
ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ఊహించని అవాంతరం ఎదురైంది. విమానం నడపాల్సిన పైలట్ సమయానికి విమానాశ్రయానికి చేరుకోకపోవడంతో 175 మందికి పైగా ప్రయాణికులు దాదాపు గంటసేపు విమానంలోనే వేచి చూడాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతోనే పైలట్ ఆలస్యంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇండిగోకి చెందిన విమానం శుక్రవారం రాత్రి 8:20 గంటలకు ఢిల్లీలోని టెర్మినల్ 1 నుంచి టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే పైలట్ రాకపోవడంతో ప్రయాణికులందరినీ విమానంలోనే కూర్చోబెట్టి చివరకు రాత్రి 9:09 గంటలకు బయలుదేరారు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ హనుమాన్ బెనివాల్ ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. వాతావరణం, ట్రాఫిక్‌ను ఊహించి తాను ముందుగానే బయలుదేరి వచ్చానని, మరి పైలట్ ఎందుకు ముందే రాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రయాణికులు ఆలస్యంగా వస్తే విమానం గంటపాటు ఆపుతారా? అని సోషల్ మీడియా వేదికగా విమానయాన సంస్థను నిలదీశారు. బాధ్యులైన ఇండిగోపై చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు. చివరకు వేరొక ఇండిగో విమానం ఢిల్లీకి చేరుకోవడంతో, ఆ విమాన పైలట్‌ను పంపి ఈ విమానాన్ని నడిపించినట్లు బెనివాల్ తెలిపారు. ఈ వివాదంపై స్పందించిన ఇండిగో యాజమాన్యం.. నగరంలో కురిసిన భారీ వర్షాలు, ట్రాఫిక్ అంతరాయాల వల్లే ఈ ఊహించని జాప్యం జరిగిందని వివరణ ఇచ్చింది. ప్రయాణికులకు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సమాచారం అందించామని స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయ టెక్కీలకు బిగ్ షాక్.. గ్రేస్ పిరియడ్ రద్దు!
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల.. డిస్కౌంట్ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు
Gold Prices: పసిడి ప్రియులకు షాక్.. బంగారం కొనాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

