AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెంట్ బాయ్‌ ఫ్రెండ్ పేరుతో  కేటుగాళ్ల వల.. డిస్కౌంట్‌ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు

రెంట్ బాయ్‌ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల.. డిస్కౌంట్‌ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు

Phani CH
|

Updated on: Aug 10, 2026 | 5:14 PM

Share

సోషల్ మీడియాలో ‘రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్’ పేరుతో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కాఫీ డేట్, మూవీ డేట్ పేరుతో ఆకర్షణీయమైన పోస్టర్లు, 50 శాతం డిస్కౌంట్ ఆఫర్లతో యువతులను మోసగిస్తున్నారు. AI ఫొటోలు, నకిలీ ప్రొఫైళ్లతో నమ్మించి అడ్వాన్స్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. అనంతరం అకౌంట్లు బ్లాక్ చేసి, వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా కొత్త రకం సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్లు అమాయకులను ముంచేందుకు వినూత్నంగా వల విసురుతున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త దందాలు ప్రారంభిస్తున్నారు. కాఫీ డేట్, మూవీ డేట్ ప్యాకేజీల పేరుతో ఆకర్షణీయమైన పోస్టర్లు క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్లంటూ ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో రంగురంగుల ప్రకటనలతో యువతులను బోల్తా కొట్టిస్తున్నారు. పలువురు యువతులు ఈ ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు. AI సాంకేతికతతో సృష్టించిన ఆకర్షణీయమైన ఫొటోలు, నకిలీ ప్రొఫైళ్లను ఉపయోగిస్తూ బాధితులకు నమ్మకం కలిగిస్తున్నారు. ఆ తర్వాత అడ్వాన్స్ రుసుము, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు తమ ఖాతాకు జమ కాగానే అకౌంట్లను బ్లాక్ చేసి ఫోన్లు స్విచ్ఛాప్ చేస్తున్నారు. కేవలం డబ్బులు దండుకోవడమే కాకుండా చాటింగ్ నెపంతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిస్కౌంట్ ఆఫర్లు, ఉచిత ప్యాకేజీలు అని వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన అపరిచితులను ప్రత్యక్షంగా కలవడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద పోస్టులు లేదా నకిలీ ఖాతాలు కనిపిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం అందించాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Prices: పసిడి ప్రియులకు షాక్‌.. బంగారం కొనాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..

బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!

చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!

యూపీఐ సేవలు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. కేంద్రం కీలక ప్రకటన

Follow Us