AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!

చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!

Phani CH
|

Updated on: Aug 10, 2026 | 4:45 PM

Share

ఇటలీలో ఓ మహిళకు అదృష్టం ఊహించని మలుపు తీసుకుంది. బహుమతి రాలేదనుకుని రూ.11 కోట్ల విలువైన లాటరీ టికెట్‌ను చెత్తబుట్టలో పడేసింది. విషయం తెలిసి తిరిగి షాప్‌కు వెళ్లేసరికి చెత్తను వాహనంలో తరలించారు. మున్సిపల్ అధికారుల సహకారంతో వ్యర్థాల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు రోజంతా వెతికి టికెట్‌ను సురక్షితంగా గుర్తించారు. దీంతో భారీ బహుమతి దక్కించుకున్న మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.

అదృష్టం తలుపు తడితే ఎవరూ ఆపలేరంటారు. ఇటలీలో ఓ మహిళ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది! పనికిరాదనుకుని చెత్తబుట్టలో పడేసిన రూ.11 కోట్ల విలువైన లాటరీ టికెట్, క్లైమాక్స్ సినిమాను తలపించేలా తిరిగి ఆమె చేతికి చేరింది. ఇటలీలోని బిటోంటో పట్టణానికి చెందిన ఓ మహిళ లాటరీ టికెట్ కొనుగోలు చేసి ఫలితాల కోసం షాప్‌కు వెళ్ళింది. మెషిన్‌లో ‘నాన్ పేయబుల్’ అనే మెసేజ్ చూసి..తన టికెట్ కు బహుమతి రాలేదనుకుని ఆ టికెట్‌ను అక్కడే చెత్తబుట్టలో పడేసి ఇంటికి వచ్చేసింది. అయితే, భారీ బహుమతులు గెలిచినప్పుడు డైరెక్ట్‌గా షాప్‌లో నగదు ఇవ్వలేకే ఆ మెషిన్ మెసేజ్ చూపిస్తుందని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆమెకు అసలు విషయం అర్థమైంది. హుటాహుటిన ఆ మహిళ దుకాణానికి పరుగెత్తింది. కానీ, అప్పటికే ఆ షాపు నుంచి చెత్త తీసుకెళ్లే వాహనం రావడం, షాపు వాళ్లు చెత్త బుట్టల్లోని చెత్తనంతా అందులో వేసేయడం జరిగిపోయాయి. దీంతో ఆమె స్థానిక మున్సిపాలిటీ తరపున చెత్త నిర్వహణ సంస్థ అధికారులను కలిసి విషయం చెప్పింది. వారు ఆ ప్రత్యేక వాహనాన్ని గుర్తించి వ్యర్థాల కేంద్రానికి తరలించారు. పారిశుద్ధ్య కార్మికులు రోజంతా చెత్తను జల్లెడ పట్టి, ఎట్టకేలకు చెక్కుచెదరకుండా అలాగే ఉన్న లాటరీ టికెట్‌ను వెలికితీశారు. దీంతో రూ.11 కోట్లు దక్కడంతో ఆ మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూపీఐ సేవలు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. కేంద్రం కీలక ప్రకటన

Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!

Follow Us