జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!
ఇండోనేషియాలోని పొంటియానాక్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తున్న 22 ఏళ్ల ఫాతియా, బ్యాలెన్స్ తప్పి మూడో అంతస్తు కిటికీలోంచి కిందపడింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. జిమ్‌లో భద్రతా లోపాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఆరోగ్యం కోసం జిమ్‌కు వెళ్లిన ఓ యువతి నిర్వాహకుల నిర్లక్ష్యానికి బలైపోయింది. జిమ్ చేస్తూ ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వెస్ట్ కలిమంతన్ పరిధిలోని పొంటియానాక్ నగరంలో ఓ ప్రైవేట్ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు మూడో అంతస్తు కిటికీలోంచి కిందపడి 22 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫాతియా అనే యువతి తన స్నేహితుడు, తమ్ముడితో కలిసి స్థానిక జిమ్‌కు వెళ్లింది. అక్కడ మూడో అంతస్తులోని ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్ ప్రారంభించింది. సుమారు 30 నిమిషాల పాటు రన్నింగ్ చేసిన అనంతరం, ఆమె నడక వేగాన్ని తగ్గించింది. సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి వెనక్కి తూలింది. అయితే ట్రెడ్‌మిల్ వెనుక భాగానికి, తెరిచి ఉన్న కిటికీకి మధ్య కేవలం 60 సెంటీమీటర్ల దూరం మాత్రమే ఉంది. అంతేకాకుండా, ఆ కిటికీ పూర్తిగా తెరిచి ఉంది. దీంతో అదుపుతప్పిన ఫాతియా నేరుగా ఆ కిటికీలోంచి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరగడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తల, ముఖం, శరీర భాగాలపై తీవ్ర గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదికలోనూ వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు జిమ్‌లోని పరికరాల అమరిక, భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిమ్ యజమానిపై కేసు నమోదు చేసి, జిమ్‌ను తాత్కాలికంగా మూసివేయించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సంచులు.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్..
న్యూ ఇయర్ గిఫ్ట్‌గా.. అల్వాల్ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
అయ్యప్పభక్తులకు తీపి కబురు.. మీ ఇంటికే నేరుగా ప్రసాదం
400 మార్కులకు 397తో భారీ స్కోర్.. టాపర్ బండారం బయటపడింది ఇలా!
జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!
స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు.. బయటపడిన సంచులు చోడగా!
400 మార్కులకు 397తో భారీ స్కోర్.. టాపర్ బండారం బయటపడింది ఇలా!
పులినే పరుగులు పెట్టించిన మంత్రి... ఆ తర్వాత!
ఎవర్రా మీరు... సింహాన్నే హడలెత్తించారుగా
వామ్మో.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు చూపించిన గిరినాగు
కిలోల బంగారం లూటీ.. ఆ ఒక్క క్లూతో దొరికిన దొంగ

