AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులినే పరుగులు పెట్టించిన మంత్రి... ఆ తర్వాత!

పులినే పరుగులు పెట్టించిన మంత్రి… ఆ తర్వాత!

Phani CH
|

Updated on: Nov 18, 2026 | 5:46 PM

Share

తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లో మంత్రి వన్నియరసు పర్యటన వివాదానికి దారితీసింది. అడవిలో సంచరిస్తున్న పులి వెనుక మంత్రి పరుగెత్తినట్లుగా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రక్షిత అటవీ ప్రాంతంలోకి ఆయనను ఎలా అనుమతించారని వన్యప్రాణి ప్రేమికులు అటవీశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తమిళనాడులోని నీలగిరి జిల్లా ముదుమలై టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. సాధారణంగా ప్రజల ప్రవేశానికి నిషేధం ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఓ మంత్రి వెళ్లడమే కాకుండా, అక్కడ సంచరిస్తున్న పులిని తరిమినట్లుగా ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై వన్యప్రాణి ప్రేమికులు, సామాన్య ప్రజలు అటవీశాఖ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నవంబర్ 10వ తేదీన నీలగిరి జిల్లా మసినగుడి ప్రాంతంలో తమిళనాడు మంత్రి వన్నియరసు పర్యటించారు. స్థానికంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా, అటవీశాఖ అధికారులు మంత్రిని ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని అత్యంత కీలకమైన, సాధారణ ప్రజలకు ప్రవేశం లేని నిషేధిత అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అడవి లోపలికి వెళ్లిన మంత్రి వన్నియరసు, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో దట్టమైన పొదల్లోంచి ఓ పెద్దపులి నడుచుకుంటూ అటుగా వెళ్లింది. పులిని చూసి అప్రమత్తం కావాల్సింది పోయి, మంత్రి దానిని తరుముతున్నట్లుగా కొంతదూరం దాని వెనుక పరుగెత్తారు. ఇదంతా కెమెరాలో రికార్డ్ కావడం, ఆ వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో బయటకు రావడంతో పెను దుమారం రేగింది. రక్షిత అటవీ ప్రాంతంలోకి వెళ్లి సోషల్ మీడియా రీల్స్, వీడియోలు తీసుకోవడానికి మంత్రికి అటవీశాఖ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని వన్యప్రాణి సంరక్షకులు ప్రశ్నిస్తున్నారు. పొరపాటున సాధారణ పౌరులు అడవి సరిహద్దుల్లోకి అడుగుపెడితేనే వెంటనే కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అధికారులు, ఏకంగా పులి వెంటే పరుగెత్తేలా మంత్రిని ఎలా వదిలేశారని నిలదీస్తున్నారు. చట్టాలు కేవలం సామాన్యులకేనా, ప్రజాప్రతినిధులకు వర్తించవా అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు వన్యప్రాణుల భద్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కార్తీకమాసంలో.. భక్తులకు శుభవార్త.. శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

ఎవర్రా మీరు… సింహాన్నే హడలెత్తించారుగా

కేజీ సన్నబియ్యం రూ.100.. అమలు కాని సర్కారు ధరలు !

అయ్యప్ప భక్తులకు అదిరిపోయే న్యూస్‌.. మకర విళక్కు యాత్రకు ప్రత్యేక రైళ్లు!

ఇక RAC లేదు? రైల్వే శాఖ సంచలన నిర్ణయం!

Follow Us