AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తీకమాసంలో.. భక్తులకు శుభవార్త.. శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

కార్తీకమాసంలో.. భక్తులకు శుభవార్త.. శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

Phani CH
|

Updated on: Nov 18, 2026 | 5:40 PM

Share

కార్తిక మాసం సందర్భంగా భక్తుల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అరుణాచలం గిరి ప్రదక్షిణ, పంచారామ క్షేత్రాల దర్శనం, శబరిమల యాత్రకు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. 30 మంది భక్తులు కలిసి వెళ్తే ప్రత్యేక బస్సు సమకూరుస్తామని అధికారులు తెలిపారు. యాత్రల టికెట్ ధరలు, బయలుదేరే తేదీలు, బుకింగ్ వివరాలు తెలుసుకోండి.

పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ అధికారులు భక్తులకు శుభవార్త అందించారు. ఈ నెలంతా ఉపవాస దీక్షలు, తీర్థయాత్రలు చేసే భక్తుల సౌకర్యార్థం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. కనీసం 30 మంది భక్తులు కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకున్నా ప్రత్యేక బస్సు సమకూరుస్తామని వరంగల్-1 డిపో మేనేజర్ తెలిపారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఈ నెల 23న మధ్యాహ్నం హనుమకొండ బస్టాండు నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. మార్గమధ్యలో కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని సందర్శించి 27న హనుమకొండకు చేరుకుంటుంది. ఇందుకు పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,500 టికెట్ ధర నిర్ణయించారు. వివరాలకు 88010 48382, 96521 24049 నంబర్లలో సంప్రదించవచ్చు. ఒకేరోజు పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటే విశేష ఫలితం దక్కుతుందన్న భక్తుల విశ్వాసం మేరకు ప్రతి ఆదివారం హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం క్షేత్రాలను ఒకేరోజులో దర్శించుకునేలా యాత్ర రూపొందించారు. పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,500 టికెట్ ధర ఉంటుంది. వివరాలకు 96521 24049 నంబరుకు కాల్ చేయవచ్చు. జిల్లాలోని అయ్యప్ప మాలధారుల కోసం శబరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. 36 మంది స్వాములు కలిసి బుక్ చేసుకుంటే బస్సు కేటాయిస్తారు. ఇందులో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక వంటమనిషి, సామగ్రి సర్దుకునే మరొకరికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎవర్రా మీరు… సింహాన్నే హడలెత్తించారుగా

కేజీ సన్నబియ్యం రూ.100.. అమలు కాని సర్కారు ధరలు !

అయ్యప్ప భక్తులకు అదిరిపోయే న్యూస్‌.. మకర విళక్కు యాత్రకు ప్రత్యేక రైళ్లు!

ఇక RAC లేదు? రైల్వే శాఖ సంచలన నిర్ణయం!

Follow Us