పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువు. ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన వాట్సాప్ సర్వీస్ ద్వారా కేవలం 14 రోజుల్లోనే కోటి మందికి పైగా లబ్ధి పొందారు. మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి 8796441800 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపితే చాలు, మీ బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి.