జుట్టు రాలడం సమస్యకు వినూత్న పరిష్కారంగా చైనా శాస్త్రవేత్తలు డీ-టాంగిల్ అనే నూతన ఎలక్ట్రిక్ దువ్వెనను అభివృద్ధి చేశారు. ఈ దువ్వెన తలపై స్వల్ప కరెంట్ తరంగాలను పంపి, జుట్టు పెరిగే మందులను నేరుగా కుదుళ్ల లోపలికి సమర్థవంతంగా చేరవేస్తుంది. ఎలకలపై ప్రయోగాల్లో, సాధారణ మందుల కంటే మెరుగ్గా, కేవలం ఒక్క నెలలోనే దాదాపు 100 శాతం జుట్టు తిరిగి పెరిగినట్లు తేలింది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది.