బంధువులకు వీడ్కోలు పలకడానికి వందే భారత్ రైలు ఎక్కిన ఓ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. తలుపులు ఆటోమెటిక్‌గా మూసుకుపోవడంతో 12 మంది పెద్దలు, ఒక చిన్నారి టికెట్ లేకుండా రైలులో చిక్కుకున్నారు. దీనితో రైల్వే అధికారులు వారికి ₹36,140 జరిమానా విధించారు. కొత్త రైళ్లలో ఎక్కవద్దని రైల్వే శాఖ హెచ్చరించింది.