చలికాలంలో పెరిగే వాయు కాలుష్యం ఊపిరితిత్తులకే కాకుండా మెదడు, నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్, ఏకాగ్రత లోపంతో పాటు నిద్రలేమికి దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా రోగులు జాగ్రత్తగా ఉండాలి. బయట కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు N95 మాస్క్ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.