ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
నంద్యాల క్రాంతినగర్‌లో అర్థరాత్రి భారీ కొండచిలువ కలకలం రేపింది. రఫీ ఇంటి సమీపంలో కనిపించిన సుమారు పది అడుగుల పొడవు, 20 కేజీలకు పైగా బరువున్న పామును చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రజాక్ గంటలపాటు శ్రమించి కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం ఎలాంటి హాని కలగకుండా దానిని సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో క్రాంతినగర్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్‌లో అర్థరాత్రి భారీ కొండచిలువ కలకలం రేపింది. కాలనీలోని రఫీ ఇంటి సమీపంలో ప్రత్యక్షమైన ఈ కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సుమారు పది అడుగుల పొడవు, 20 కేజీలకు పైగా బరువున్న ఈ భారీ పామును చూసి కాలనీవాసులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ప్రముఖ స్నేక్ క్యాచర్ రజాక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగిన రజాక్‌కు ఓ క్రమంలో చుక్కలు చూపించింది ఆ భారీ కొండచిలువ. ఆయన గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు దానిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా కొండచిలువను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ క్రాంతినగర్ వాసులకు నిద్రలేకుండా చేస్తున్న భారీ కొండచిలువ చివరకు చిక్కడంతో స్థానికులు ఉపశమనం పొందారు. కొండచిలువను రజాక్ సురక్షితంగా సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
యూపీఐ సేవలు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. కేంద్రం కీలక ప్రకటన
Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!
వలలో చిక్కిన 23 కేజీల "పండుగప్ప".. వేలంలో కళ్లుచెదిరే రేటు!
ఇక గోరింటాకు కూడా మెషీన్‌తోనే.. మరికొన్ని ఉద్యోగాలు హుష్!
పాము కాటుకి సరికొత్త విరుగుడు! 100 ఏళ్ల సమస్యకి చెక్!
అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం

