భారతీయ టెక్కీలకు బిగ్ షాక్.. గ్రేస్ పిరియడ్ రద్దు!
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే విదేశీ నిపుణులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే ప్రతిపాదన ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాదారులపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగం కోల్పోయిన వెంటనే వీసా స్టేటస్ ముగిసే పరిస్థితి వస్తే, ప్రత్యామ్నాయ ఉద్యోగం వెతుక్కోవడానికి సమయం లేకుండా అమెరికాను వీడాల్సి రావచ్చు. దీంతో వేలాది మంది భారతీయ టెక్కీల్లో ఆందోళన నెలకొంది.
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 రోజుల ‘గ్రేస్ పీరియడ్’ సదుపాయాన్ని పూర్తిగా రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రూపొందించిన కొత్త నిబంధన ప్రతిపాదన ప్రస్తుతం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ సమీక్ష దశలో ఉంది. 2017 నుంచి అమల్లో ఉన్న ఈ 60 రోజుల నిబంధన ప్రకారం హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే.. మరొక కంపెనీలో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మార్చుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఈ కొత్త నిబంధన గనుక అమల్లోకి వస్తే 60 రోజుల వెసులుబాటు పూర్తిగా రద్దవుతుంది. ఫలితంగా ఉద్యోగం పోయిన మరుక్షణమే వీసా స్టేటస్ ముగిసిపోయి, ప్రత్యామ్నాయం వెతుక్కునే సమయం లేకుండా తక్షణమే అమెరికాను వీడాల్సి వస్తుంది. ఈ పరిణామం అమెరికాలోని భారతీయ టెక్కీలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపనుంది. హెచ్-1బీ వీసా పొందుతున్న వారిలో అత్యధికంగా భారతీయులే ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన మొత్తం హెచ్-1బీ పిటిషన్లలో దాదాపు 71 శాతం భారతీయులవే కావడం గమనార్హం. అమెరికాలో 5.2 మిలియన్లకు పైగా భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక అధికారాలతో జోక్యం చేసుకుంటే తప్ప, ఉద్యోగం పోయినవారు వెంటనే స్వదేశానికి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలోనే ఉన్నప్పటికీ, అక్కడి వేలాది భారతీయ కుటుంబాలు, టెక్కీలలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల.. డిస్కౌంట్ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు
Gold Prices: పసిడి ప్రియులకు షాక్.. బంగారం కొనాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే

