AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. కొత్త నిబంధనలు ఇవే!

ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. కొత్త నిబంధనలు ఇవే!

Phani CH
|

Updated on: Oct 28, 2026 | 12:15 PM

Share

ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు అక్టోబర్‌ 26 నుంచి కొత్త బయోమెట్రిక్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అవసరమైన దరఖాస్తుదారులు వేలిముద్రలతో పాటు ముఖ చిత్రాన్ని కూడా సమర్పించాలి. ఆస్ట్రేలియా హోమ్‌ అఫైర్స్‌ శాఖ నుంచి అధికారిక ఈ-మెయిల్‌ వచ్చిన తర్వాతే బయోమెట్రిక్‌ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. అర్హులైన వారు ఆస్ట్రేలియన్‌ ఇమ్మి యాప్‌ ద్వారా కూడా వివరాలు సమర్పించవచ్చు.

ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు మరియు పర్యాటకులకు ఆ దేశ ప్రభుత్వం ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. వీసా ప్రక్రియను మరింత సురక్షితంగా, పటిష్ఠంగా మార్చే లక్ష్యంతో భారత్‌లోని దరఖాస్తుదారులకు బయోమెట్రిక్ వివరాల సేకరణను తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 26 నుంచే అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ వేలిముద్రలతో పాటు ‘ఫేషియల్ ఇమేజ్’ కూడా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనల పట్ల దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా హైకమిషన్ స్పష్టం చేసింది. బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిన వారికి ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అధికారికంగా ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆ లేఖ అందిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 16 వీఎఫ్ఎస్ కేంద్రాల్లో ఏదో ఒకదానికి వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా, అర్హులైన వారు ‘ఆస్ట్రేలియన్ ఇమ్మి యాప్’ (Australian Immi App) ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసే వెసులుబాటును కల్పించారు. అధికారిక ఈ-మెయిల్ రాకముందు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవద్దని సూచించారు. గుర్తింపు మోసాలను అరికట్టడం, వలస వ్యవస్థ సమగ్రతను కాపాడటమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ బయోమెట్రిక్స్ సేకరణ వల్ల వీసా ప్రాసెసింగ్ సమయంపై ఎలాంటి ప్రభావం పడదని తెలిపింది. సేకరించిన సమాచారాన్ని ఆస్ట్రేలియా, భారత చట్టాలకు అనుగుణంగా ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో అత్యంత భద్రంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే దాదాపు 60 దేశాల్లో ఈ విధానం అమలులో ఉంది. ఆస్ట్రేలియాలో దాదాపు 9.76 లక్షల మంది భారతీయ మూలాలు ఉన్నవారు నివసిస్తున్నారు, అలాగే లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

సీఎంనే కదిలించిన చిన్నారి పెద్ద మనసు

పండుగ సమయంలో గ్యాస్ బుక్ చేస్తున్నారా? ఈ న్యూస్‌ మీ కోసమే!

రూ.3 లక్షల ఐఫోన్‌లో డిస్‌ప్లే సమస్య.. అసలు కారణం ఇదేనా?

11 కేవీ విద్యుత్ వైర్‌పై ఉమ్మి వేశాడు.. క్షణాల్లో..

Follow Us