AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

Phani CH
|

Updated on: Oct 28, 2026 | 12:12 PM

Share

చీరకట్టుతో చెప్పులు లేకుండా పరుగెత్తి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఝార్ఖండ్‌కు చెందిన కవితకు నిరాశ ఎదురైంది. హోంగార్డు నియామక పరీక్షలో 1,600 మీటర్ల పరుగును 8 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేసినా, హైజంప్‌లో విఫలమవడంతో ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయింది. భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలు, వృద్ధ అత్తమామల బాధ్యతలు చూసుకుంటున్న ఆమె కథ నెటిజన్లను కదిలిస్తోంది.

సోషల్ మీడియాలో చీరకట్టుతో, చెప్పులు లేకుండా పరుగెత్తి దేశవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఝార్ఖండ్‌కు చెందిన కవిత ప్రయాణం భావోద్వేగంగా ముగిసింది. తన జీవితాన్ని మార్చుతుందనుకున్న హోంగార్డు ఉద్యోగ నియామక పరీక్షలో ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. పరుగు పందెంలో నిర్దేశిత సమయం కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ, హైజంప్‌లో విఫలమవడంతో ఉద్యోగం పొందే అవకాశాన్ని కోల్పోయింది. ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాకు చెందిన కవిత ఇద్దరు పిల్లల తల్లి. కొద్ది రోజుల క్రితం భర్త మరణించడంతో, పిల్లలతో పాటు వృద్ధులైన అత్తమామల సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆమెపైనే పడింది. కుటుంబ పోషణ కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఆమె హోంగార్డు ఉద్యోగానికి గట్టి పట్టుదలతో సిద్ధమైంది. ఇటీవల జరిగిన నియామక పరీక్షల్లో భాగంగా నిర్వహించిన 1600 మీటర్ల పరుగు పందెంలో ఆమె అసాధారణ ప్రతిభ చూపింది. సాధారణంగా ఈ దూరాన్ని పూర్తి చేయడానికి 10 నిమిషాల సమయం కేటాయించగా, కవిత మాత్రం కేవలం 8 నిమిషాల 57 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని అందరినీ విస్మయపరిచింది. అయితే, ఈ విజువల్స్ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే సంచలనం సృష్టించాయి. సిడో-కన్హు జిల్లా మైదానంలో జరిగిన ట్రయల్ రన్‌లో పేదరికం కారణంగా కనీసం స్పోర్ట్స్ షూస్ కూడా కొనుగోలు చేసే స్థోమత లేక, ఆమె చీరకట్టుతోనే పరిగెత్తింది. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో ఆమె పట్టుదలను మెచ్చి ఎందరో దాతలు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పరుగులో ఆమె చూపిన ప్రతిభతో ఈ ఉద్యోగం ఆమెకు పక్కా అని అంతా భావించారు. కానీ, నియామక ప్రక్రియలో భాగంగా తర్వాతి దశ అయిన ‘హైజంప్’ పరీక్ష కవితకు పెద్ద సవాల్‌గా మారింది. అధికారులు ఆమెకు మూడుసార్లు అవకాశం కల్పించినప్పటికీ, నిర్దేశిత ఎత్తును దాటడంలో ఆమె విఫలమైంది. దీంతో నిబంధనల ప్రకారం ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. ఈ పరీక్షకు మొత్తం 930 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. పరుగు పందెంలో గెలుపు ఆమె కలను సాకారం చేస్తుందని ఆశించినా, హైజంప్‌లో వైఫల్యం ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఘటన కవిత విజయాలను అందుకోలేకపోయినా, ఆమె పోరాట పటిమను మాత్రం శాశ్వతంగా నిలిపింది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీఎంనే కదిలించిన చిన్నారి పెద్ద మనసు

పండుగ సమయంలో గ్యాస్ బుక్ చేస్తున్నారా? ఈ న్యూస్‌ మీ కోసమే!

రూ.3 లక్షల ఐఫోన్‌లో డిస్‌ప్లే సమస్య.. అసలు కారణం ఇదేనా?

11 కేవీ విద్యుత్ వైర్‌పై ఉమ్మి వేశాడు.. క్షణాల్లో..

రెండేళ్లకే చిన్నారి అద్భుతం.. తబలాపై 12 తాళాలు వాయించి రికార్డ్‌

Follow Us