AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎంనే కదిలించిన చిన్నారి పెద్ద మనసు

సీఎంనే కదిలించిన చిన్నారి పెద్ద మనసు

Phani CH
|

Updated on: Oct 28, 2026 | 12:11 PM

Share

కరువుతో ఇబ్బందులు పడుతున్న రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో వర్దా తిమాండే అనే చిన్నారి తన తమ్ముడితో కలిసి పిగ్గీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.3,575ను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చింది. చిన్నారి ఉదారతను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సోషల్‌ మీడియాలో ప్రశంసించారు. రైతుల కష్టాలను చిన్న వయస్సులోనే అర్థం చేసుకుని స్పందించడం సమాజానికి గొప్ప పాఠమని పేర్కొన్నారు. ఈ ఘటన నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

కరువుతో అల్లాడుతున్న రైతన్నల కష్టాలు చూసి చలించిపోయిన ఒక చిన్నారి, తన దాచుకున్న పొదుపు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చి అందరి హృదయాలను గెలుచుకుంది. ముంబైలో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్ర సీఎంనే కదిలించింది. వర్దా తిమాండే అనే చిన్నారి తన తమ్ముడితో కలిసి పిగ్గీ బ్యాంక్‌లో దాచుకున్న రూ. 3,575 మొత్తాన్ని కరువు బారిన పడిన రైతులకు సహాయంగా అందజేసింది. ఈ సొమ్మును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చి, కష్టాల్లో ఉన్న ‘బలిరాజ’ ముఖాల్లో కాస్తయినా సంతోషాన్ని నింపాలని ఆమె ప్రతిపాదించింది. ఈ అరుదైన విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన సోషల్‌ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. “చిన్న చేతుల నుండి అందిన గొప్ప సహాయం ఇది.. బలిరాజ పట్ల ఒక తల్లి బిడ్డ చూపిన మమకారం!” అని ఆయన ప్రశంసించారు. “మా ఈ చిన్న సహాయం రైతు మామయ్యల ముఖాల్లో చిరునవ్వులు నింపుతుంది” అని వర్దా చెప్పిన అమాయకమైన, ఉదారమైన మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మన జీవనాధారమైన రైతుల కష్టాలను అంత చిన్న వయస్సులోనే అర్థం చేసుకుని, స్పందించిన విధానం సమాజానికే ఒక గొప్ప పాఠమని ఆయన అన్నారు. వర్దా దయగల హృదయానికి, ఆమె చేసిన నిస్వార్థ సహాయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఘటన ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పండుగ సమయంలో గ్యాస్ బుక్ చేస్తున్నారా? ఈ న్యూస్‌ మీ కోసమే!

రూ.3 లక్షల ఐఫోన్‌లో డిస్‌ప్లే సమస్య.. అసలు కారణం ఇదేనా?

11 కేవీ విద్యుత్ వైర్‌పై ఉమ్మి వేశాడు.. క్షణాల్లో..

రెండేళ్లకే చిన్నారి అద్భుతం.. తబలాపై 12 తాళాలు వాయించి రికార్డ్‌

ఇంజనీరింగ్‌ చేయని ఇంజనీర్‌.. ఎగిరే కారును సృష్టించిన యువకుడు

Follow Us