జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!
జర్మనీలో ‘జెన్-జీ రెగెల్ట్’ పేరుతో యువత చేపట్టిన నిరసనలు 34 నగరాల్లో హింసాత్మకంగా మారినట్లు కథనం పేర్కొంది. విద్యా నిధుల కోత, పెరుగుతున్న జీవన వ్యయం, బలవంతపు సైనిక సేవకు వ్యతిరేకంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల ధ్వంసం, దోపిడీలు చోటుచేసుకోగా, ఇతర నగరాల్లోనూ పోలీసులతో ఘర్షణలు జరిగాయి. వాటర్ క్యానన్లు, పెప్పర్ స్ప్రే ప్రయోగించి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.
జర్మనీలో జెన్-జీ చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ‘జెన్ జెడ్ రెగెల్ట్’ (Gen-Z Regelt) పేరిట శనివారం రాత్రి దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసనలు పలు నగరాల్లో ఘర్షణలకు దారితీశాయి. విద్యా నిధుల కోత, పెరుగుతున్న జీవన వ్యయం, ప్రజా సేవల క్షీణత, బలవంతపు సైనిక సేవ వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ సహా దాదాపు 34 నగరాల్లో వేలాది మంది యువతీ యువకులు రోడ్లపైకి వచ్చారు. ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో నిరసనలు అదుపుతప్పాయి. ఆందోళనకారులు నగర కేంద్రంలోని దుకాణాల కిటికీలను పగలగొట్టి దోపిడీలకు పాల్పడ్డారు. చివరికి ఒక ఆయుధాల దుకాణంపై దాడికి యత్నించగా, పోలీసులు తక్షణమే స్పందించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు, సీసాలు, మోలోటోవ్ కాక్‌టెయిల్స్‌తో దాడులు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అధికారులు జీల్ షాపింగ్ వీధిని మూసివేసి నగర కేంద్రాన్ని ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. అటు హ్యాంబర్గ్‌లో బారికేడ్లను తగులబెట్టగా.. కొలోన్, బెర్లిన్‌లలో కూడా తీవ్ర ఘర్షణలు నమోదయ్యాయి. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు, పెప్పర్ స్ప్రేలను ఉపయోగించారు. ఈ హింసాత్మక ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడగా, పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను అరెస్టు చేశారు. తమ పోరాటం శాంతి, స్వేచ్ఛ, విద్యా-ఆరోగ్య రంగాల సంస్కరణల కోసమేనని నిర్వాహకులు లినా ఫ్రెడ్రిక్ పేర్కొన్నప్పటికీ.. శాంతియుతంగా మొదలైన నిరసనలు సాయంత్రానికి హింసగా మారడం వెనుక తీవ్రవాద గ్రూపుల ప్రమేయం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
WhatsApp: వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు… ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

