AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

పక్షవాతం అన్నాడు… ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

Phani CH
|

Updated on: Nov 02, 2026 | 12:22 PM

Share

సోషల్‌ మీడియాలో రెండు ఆసక్తికర వీడియోలు వైరల్‌గా మారాయి. పక్షవాతం వచ్చిందంటూ యాచిస్తున్న వ్యక్తి ఇంజెక్షన్‌ పేరు వినగానే లేచి పరుగెత్తిన వీడియో నెటిజన్లను నవ్విస్తోంది. మరోవైపు అమెరికాలోని ఫ్లోరిడాలో మూడేళ్ల నెవాడా అనే బాలుడు 12 నిమిషాల్లో 10 గోల్స్‌ కొట్టడంతో సాకర్‌ మ్యాచ్‌లో వివాదం చెలరేగింది. ఇతర పిల్లలు బంతిని అందుకోలేకపోతున్నారంటూ నిర్వాహకులు పోలీసులను పిలవడం చర్చనీయాంశమైంది.

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని కన్నీరు తెప్పిస్తాయి. అయితే కొన్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఫన్నీ వీడియో నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది. పక్షవాతంతో బాధపడుతున్నానంటూ రోడ్డు పక్కన యాచకత్వం చేస్తున్న ఓ వ్యక్తి.. ఇంజెక్షన్ పేరు చెప్పగానే క్షణాల్లో అద్భుతం జరిగినట్లు లేచి పరిగెత్తిన తీరు అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. అసలేం జరిగిందంటే…రోడ్డు పక్కన కదల్లేని స్థితిలో, పక్షవాతంతో బాధపడుతున్నానంటూ ఓ వ్యక్తి దీనంగా కూర్చుని భిక్షాటన చేస్తుంటాడు. ఆ దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి అతని దగ్గరకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని, వాడుతున్న మందుల గురించి ఆరా తీస్తాడు. మాటల మధ్యలో సదరు వ్యక్తి తన దగ్గరున్న ఒక ఇంజెక్షన్‌ను బయటకు తీస్తాడు. “ఈ ఇంజెక్షన్ ఇస్తే నీ పక్షవాతం ఇట్టే తగ్గిపోతుంది” అంటూ చెబుతాడు. అయితే, ఇంజెక్షన్ చూడగానే ఆ యాచకుడిలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు వస్తుంది. పక్షవాతం వచ్చి కదలలేనని నటించిన ఆ వ్యక్తి, ఇంజెక్షన్ భయంతో క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క ఉదుటున లేచి నిలబడతాడు. అంతేకాదు, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా మెరుపు వేగంతో పరుగులు తీస్తాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. “ఇంజెక్షన్ అద్భుతంగా పనిచేసింది”, “సెకన్ల వ్యవధిలో పక్షవాతం మాయమైంది”, “డాక్టర్లు ఆశ్చర్యపోయే వైద్యం ఇది” అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ సరదా వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, నెట్టింట మాత్రం నవ్వులు పూయిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఓ యూత్ సాకర్ మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కేవలం మూడేళ్ల వయసున్న ఓ చిన్నారి సాకర్ ఆటలో అద్భుత ప్రతిభ కనబరిచి క్షణాల్లో గోల్స్ కొట్టాడు. అయితే, తోటి పిల్లలు అతని నుంచి బంతిని లాక్కోలేకపోవడంతో అసహనానికి గురైన నిర్వాహకులు, కొందరు తల్లిదండ్రులు ఏకంగా పోలీసులను ఆశ్రయించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫ్లోరిడాలోని వింటర్ పార్క్‌లో శనివారం జరిగిన యూత్ సాకర్ లీగ్ గేమ్‌లో మూడేళ్ల నెవాడా అనే నల్లజాతీయ బాలుడు తనకంటే పెద్దవారైన ఐదేళ్ల పిల్లలతో కలిసి ఆడాడు. ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే నెవాడా అద్భుతమైన డ్రిబ్లింగ్‌తో కేవలం 12 నిమిషాల్లోనే ఏకంగా 10 గోల్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, నెవాడా ఆటతీరు చూసి ఇతర పిల్లల తల్లిదండ్రులు సంతోషించకపోగా, తమ పిల్లలు అసలు బంతినే తాకలేకపోతున్నారంటూ కోపగించుకున్నారు. నెవాడా బంతిని తన వద్దే ఉంచుకుని అందరినీ దాటుకుంటూ వెళ్తుండటంతో వివాదం తలెత్తింది. పిల్లల ప్రతిభను మెచ్చుకోవాల్సింది పోయి, లీగ్ నిర్వాహకుడు థామస్ హేస్ 911కి డయల్ చేసి మైదానంలో గందరగోళం జరుగుతోందంటూ పోలీసులను పిలిచాడు. మరోవైపు నెవాడా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కొడుకు ఆటలో చాలా ప్రతిభావంతుడిగా ఉన్నాడని, కేవలం అతను బంతిని ఇవ్వడం లేదన్న” కక్షతోనే లీగ్ నిర్వాహకులు పోలీసులను పిలిచి అవమానించారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాత్యహంకార ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

Follow Us