పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు తక్కువ కేలరీలు, అధిక పోషకాలు కలిగిన ఆహారం. అయితే ఇవి శాకాహారమా, మాంసాహారమా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం, పుట్టగొడుగులు మొక్కలు కాదు, జంతువులు కూడా కాదు. ఇవి శిలీంధ్రాల విభాగానికి చెందినవి. వీటిలో ప్రొటీన్లు, విటమిన్ బి, పొటాషియం, సెలీనియం, ఫైబర్ వంటి పోషకాలు ఉండటంతో ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.
తక్కువ కేలరీలు, పుష్కలమైన పోషకాలు కలిగి ఉండి మాంసానికి సరైన ప్రత్యామ్నాయంగా మారుతున్న పుట్టగొడుగులు నేడు ఆరోగ్య ప్రియుల డైట్ లిస్ట్‌లో తప్పనిసరిగా ఉంటున్నాయి. అయితే, చూడ్డానికి, తినడానికి కొంత మాంసాహార అనుభూతిని కలిగించడంతో.. అసలు పుట్టగొడుగులు శాకాహారమా లేక మాంసాహారమా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం, పుట్టగొడుగులు జంతువుల నుంచి రావు, అలాగని ఇవి సాధారణ మొక్కలు కూడా కావు. ఇవి ‘శిలీంధ్రాలు’ అనే ప్రత్యేక విభాగానికి చెందినవి. వీటికి ఆకులు, వేర్లు, పువ్వులు ఉండవు. చుట్టూ ఉండే సేంద్రియ పదార్థాల నుంచి పోషకాలను గ్రహించి పెరుగుతాయి. వీటిలో ఎలాంటి జంతు సంబంధిత కణాలు, గుడ్లు లేదా మాంసపు ఆనవాళ్లు ఉండవు కాబట్టి శాకాహారులు, వీగన్లు వీటిని నిస్సందేహంగా తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. పుట్టగొడుగుల్లో కొవ్వు శాతం, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి అద్భుతమైన ఎంపిక. వీటిలో శరీరానికి మేలు చేసే ప్రొటీన్లు, విటమిన్-బి, పొటాషియం, సెలీనియం వంటి ముఖ్య పోషకాలు లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలోని అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే సమతులాహారంలో భాగంగా ఇతర కూరగాయలు, పప్పులతో కలిపి వీటిని తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

