New Building Rules: బిల్డింగ్ రూల్స్ మారుతున్నాయ్..ఇల్లు కట్టుకోవడం ఇక ఈజీ..
తెలంగాణలో సొంతింటి నిర్మాణం చేపట్టాలనుకునేవారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. 100 గజాల వరకు ఇంటి నిర్మాణ అనుమతుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. అలాగే సెట్‌బ్యాక్ నిబంధనల సడలింపు, సెల్లార్ పార్కింగ్ పరిమితుల తగ్గింపుపైనా కసరత్తు చేస్తోంది. కొత్త బిల్డింగ్ రూల్స్ అమల్లోకి వస్తే చిన్న ప్లాట్ల యజమానులకు భారీ ఊరట లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి.
సొంతింటి కల నెరవేర్చుకోవాలంటే ముందుగా స్థలం కొనడం ఒక ఎత్తయితే, ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం మరో పెద్ద సవాలు. ముఖ్యంగా చిన్న ప్లాట్లు ఉన్నవారు పార్కింగ్, చుట్టూ ఖాళీ స్థలం వంటి కఠిన నిబంధనల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. 2012లో రూపొందించిన పాత భవన నిర్మాణ నిబంధనలకు ఇప్పటివరకు 62 సార్లు విడివిడిగా సవరణలు చేశారు. అవన్నీ సమగ్రంగా లేవని భావించిన ప్రభుత్వం, ఇప్పుడు సామాన్యులు మరియు బిల్డర్లకు అనుకూలంగా ఉండేలా ఒకే సమగ్రమైన కొత్త నియమావళిని రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త నిబంధనల ప్రతిపాదనల్లో ప్రధానంగా చిన్న ప్లాట్లు ఉన్న మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం 75 గజాల వరకు ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల నుంచి మినహాయింపు ఉండగా, ఆ పరిమితిని 100 గజాలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలైతే 100 గజాలలోపు స్థలంలో ఇల్లు కట్టుకునేవారు అనుమతుల కోసం తిరగాల్సిన పని ఉండదు. అలాగే, స్థలం తక్కువగా ఉన్నందున నిర్మాణ విస్తీర్ణం తగ్గిపోతోందన్న ఆందోళనను దూరం చేస్తూ, భవనం చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలం దూరాలను గరిష్ఠంగా 20 శాతం వరకు తగ్గించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. దీనివల్ల చిన్న ప్లాట్లలోనూ మరికొంత అదనపు నిర్మాణ స్థలం అందుబాటులోకి వస్తుంది. నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను తగ్గించేందుకు సెల్లార్ నిబంధనల్లోనూ కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం 900 గజాల స్థలం ఉంటేనే సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఉండగా, ఈ పరిమితిని 600 గజాలకు తగ్గించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ప్రస్తుతం ఒక సెల్లార్ మాత్రమే అనుమతిస్తుండగా, దానిని రెండు సెల్లార్లకు పెంచాలని భావిస్తున్నారు. దీనివల్ల వాహనాలను రోడ్లపై నిలిపే పరిస్థితి తగ్గుతుంది. మరోవైపు, బిల్డర్లకు భారంగా మారిన ‘మార్టిగేజ్’ నిబంధనను నిర్దిష్ట పరిమాణంలోపు నిర్మాణాలకు పూర్తిగా తొలగించే విషయంపైనా ప్రభుత్వం పునరాలోచిస్తోంది. ప్రస్తుతం ఈ అంశాలన్నీ మున్సిపల్ శాఖ అధికారుల ముసాయిదా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే కొత్త బిల్డింగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: గాయత్రీ హోమ ఫలితం.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సమంత
సోయి లేకుంటే ఎలా.. అడ్డంగా మోసపోయింది..!
Nayanthara: నా జీవితంపై డాక్యుమెంటరీ ఎందుకు తీయకూడదు.. విమర్శకులకు నయన్ కౌంటర్!
Ramya Krishnan: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!
స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..
బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!

