AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులకు రైల్వే బిగ్ అప్‌డేట్..18 రైళ్ల నెంబర్లు, ఛార్జీల్లో మార్పులు

ప్రయాణికులకు రైల్వే బిగ్ అప్‌డేట్..18 రైళ్ల నెంబర్లు, ఛార్జీల్లో మార్పులు

Phani CH
|

Updated on: Nov 09, 2026 | 5:11 PM

Share

2027 జనవరి 1 నుంచి భారతీయ రైల్వేలో పలు రైళ్ల వర్గీకరణ, నంబర్లలో మార్పులు జరగనున్నాయి. నార్తర్న్‌ రైల్వే పరిధిలోని 18 సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు సాధారణ ఎక్స్‌ప్రెస్‌లుగా మారనున్నట్లు సమాచారం. దీంతో సూపర్‌ఫాస్ట్‌ సర్‌ఛార్జ్‌ తగ్గి ప్రయాణికులకు కొంత డబ్బు ఆదా కానుంది. సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే పరిధిలోని మరికొన్ని రైళ్ల నంబర్లు కూడా మారనున్నాయి. కొత్త నంబర్లను NTES యాప్‌, 139 హెల్ప్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాలి.

భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం అందించింది. 2027 జనవరి 1 నుంచి పలు రైళ్ల వర్గీకరణతో పాటు వాటి నంబర్లలో మార్పులు చేయనుంది. ముఖ్యంగా నార్తర్న్ రైల్వే పరిధిలో నడిచే 18 సూపర్‌ఫాస్ట్ రైళ్లను సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పుల వల్ల ఢిల్లీ, బీహార్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం పడనుంది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం సూపర్‌ఫాస్ట్ హోదా ఉండాలంటే రైలు సగటు వేగం గంటకు కనీసం 55 కిలోమీటర్లు ఉండాలి. మార్గాల్లో రద్దీ, అదనపు హాల్టులు మరియు స్టేషన్లలో ఎక్కువసేపు నిలపడం వల్ల ఈ 18 రైళ్లు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నాయని సమీక్షలో తేలింది. అందుకే వీటిని సాధారణ ఎక్స్‌ప్రెస్‌లుగా వర్గీకరించారు. దీనివల్ల ప్రయాణికులకు సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్ భారం తగ్గి డబ్బులు ఆదా కానున్నాయి. స్లీపర్ క్లాస్‌పై రూ.30, ఏసీ 3 టైర్/2 టైర్/చైర్ కార్‌లపై రూ.45, ఫస్ట్ ఏసీ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌పై రూ.75 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ మార్పుల్లో భాగంగా తనక్‌పూర్-ఢిల్లీ , డెహ్రాడూన్-కాఠ్‌గోదాం , ఇస్లాంపూర్-న్యూఢిల్లీ , దర్భంగా-జలంధర్ , పాట్నా-చండీగఢ్ , ముజఫర్‌పూర్-ఆనంద్ విహార్ , రాజ్‌గిర్-న్యూఢిల్లీ వంటి ప్రధాన రైళ్లకు పాత నంబర్ల స్థానంలో కొత్త సిరీస్ నంబర్లు రానున్నాయి. మరోవైపు సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని విశ్వమానవ ఎక్స్‌ప్రెస్ , మల్గుడి ఎక్స్‌ప్రెస్, తిరుపతి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్, ముంబై-తిరువనంతపురం గరీబ్ రథ్ నంబర్లలో కూడా జనవరి 1 నుంచి 4వ తేదీ మధ్య మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త ఏడాదిలో టికెట్లు బుక్ చేసుకునే వారు NTES యాప్, 139 హెల్ప్‌లైన్ లేదా అధికారిక రైల్వే వెబ్‌సైట్‌లో కొత్త నంబర్లను తనిఖీ చేసుకోవాలని రైల్వే సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి

బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో

ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు మించిన రాబడినిచ్చే ప్రభుత్వ పథకాలు.. 100% సేఫ్‌

మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

Follow Us