AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు మించిన రాబడినిచ్చే ప్రభుత్వ పథకాలు.. 100% సేఫ్‌

ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు మించిన రాబడినిచ్చే ప్రభుత్వ పథకాలు.. 100% సేఫ్‌

Phani CH
|

Updated on: Nov 09, 2026 | 5:06 PM

Share

బ్యాంక్‌ ఎఫ్‌డీలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ మద్దతు ఉన్న పలు పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్‌ డిపాజిట్‌, అమృత్‌ వృష్టి, ఆర్‌బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్లు, పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్లు, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ వీటిలో ముఖ్యమైనవి. పెట్టుబడి కాలం, వడ్డీ రేట్లు, విత్‌డ్రా నిబంధనలు, పన్ను ప్రయోజనాలను బట్టి వీటిని ఎంచుకోవచ్చు. సీనియర్‌ సిటిజన్లకు కొన్ని పథకాలు అధిక వడ్డీని అందిస్తున్నాయి.

మనదేశంలో కష్టపడి సంపాదించిన సొమ్మును భద్రంగా ఉంచుకోవడానికి మెజారిటీ ప్రజలు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లనే ఎంచుకుంటారు. అయితే, ప్రస్తుతం ఎస్‌బీఐ వంటి పెద్ద బ్యాంకుల్లో ప్రామాణిక ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 6.05% నుంచి 6.40% వరకే పరిమితమయ్యాయి. కానీ, ఎలాంటి క్రెడిట్ రిస్క్ లేకుండా 100% ప్రభుత్వ భద్రతతో 8.20% వరకు వార్షిక రాబడినిచ్చే 4 అద్భుతమైన ప్రత్యామ్నాయ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ మల్టీ-ఆప్షన్ డిపాజిట్ : సాధారణ ఎఫ్‌డీలా కాకుండా ఇది సేవింగ్స్ ఖాతాతో లింక్ అయి ఉంటుంది. అత్యవసర సమయంలో మొత్తం ఎఫ్‌డీని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేకుండా, కావాల్సిన మొత్తాన్నిఏటీఎం లేదా యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన నిధులపై ఎఫ్‌డీ మాదిరిగానే 6.05% నుంచి 6.45% వరకు వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐ అమృత్ వృష్టి : ఒకటిన్నర సంవత్సరాల వ్యవధికి డబ్బు పార్క్ చేయాలనుకునే వారికి ఈ ప్రత్యేక ఎఫ్‌డీ అనుకూలం. సాధారణ పౌరులకు 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05% వరకు వడ్డీ లభిస్తుంది. ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు (FRSB): కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న ఈ బాండ్లలో గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. 7 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉన్న ఈ బాండ్లు ప్రస్తుతం 8.05% వడ్డీని అందిస్తున్నాయి. NSC రేటు కంటే 0.35% అదనపు ప్రీమియం లభిస్తుంది. పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు: పోస్టాఫీస్ 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ 7.50% వడ్డీతో పాటు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపునిస్తుంది. అలాగే ‘సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్’ ద్వారా వృద్ధులకు 100% సురక్షితమైన 8.20% అత్యధిక వార్షిక వడ్డీ లభిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

Follow Us