AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టోల్ ఫీజు ఎగ్గొట్టాలని చూసారో జాగ్రత్త..!

టోల్ ఫీజు ఎగ్గొట్టాలని చూసారో జాగ్రత్త..!

Phani CH
|

Updated on: Nov 29, 2026 | 6:55 PM

Share

జాతీయ రహదారులపై టోల్ ఫీజు ఎగవేతలకు కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. నంబర్ ప్లేట్లు మార్చినా, ఫాస్ట్‌ట్యాగ్ అడ్డుకున్నా టోల్ మొత్తానికి ఆరు రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. AI ఆధారిత సాంకేతికతతో ఉల్లంఘనదారులను సులభంగా గుర్తిస్తారు. బ్యాలెన్స్ లేకపోతే 72 గంటల్లో చెల్లించకుంటే రెట్టింపు టోల్ వసూలు చేస్తారు.

జాతీయ రహదారులపై టోల్ ఫీజు ఎగవేతలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు ప్రకటించింది. టోల్ చెల్లింపులను తప్పించుకునే ఉద్దేశ్యంతో వాహన నెంబర్ ప్లేట్లను మార్చినా, కప్పివేసినా లేదా ఫాస్ట్‌ట్యాగ్‌ను అడ్డుకున్నా భారీ జరిమానా విధించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, టోల్ ఎగవేసినట్లయితే అసలు టోల్ మొత్తానికి ఐదు రెట్లు అదనంగా పెనాల్టీ, అసలు టోల్ కలిపి మొత్తం ఆరు రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, రూ. 100 టోల్ ఎగ్గొడితే, రూ. 500 జరిమానా, రూ. 100 అసలు కలిపి మొత్తం రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు బ్యారియర్లు లేని మల్టీ లైన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ ప్లాజాల వద్ద అమల్లోకి వస్తాయి. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లను దాచిపెట్టడం, ఫాస్ట్‌ట్యాగ్ స్కాన్ కాకుండా అడ్డుకోవడం లేదా ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా ప్రయాణించడం వంటివి ఉల్లంఘనలుగా పరిగణించబడతాయి. NHAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వెహికల్ ఫింగర్ ప్రింటింగ్ సాంకేతికతతో వాహనాలను గుర్తిస్తుంది. అయితే, ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ లేకపోవడం ఉద్దేశపూర్వక ఎగవేతగా చూడరు. అలాంటి సందర్భాల్లో 72 గంటల్లోపు చెల్లిస్తే అసలు టోల్ సరిపోతుంది. ఆ గడువు దాటితే రెట్టింపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెట్టింగ్ వద్దు.. బాసరలో భద్రతా మంత్రం!

క్యా సీన్‌ హై.. మరుగు దొడ్లో బంగారం.. చిప్స్‌ ప్యాకెట్‌లో

14 ఏళ్ల నాగార్జున రికార్డు బ్రేక్.. తరుణ్ భాస్కర్‌ సెన్సేషన్!

సూర్య – జ్యోతిక లవ్ స్టోరీని.. లీక్‌ చేసిన లైలా

Shruti Haasan: దుష్టశక్తులను ఆరాధిస్తోందా? శృతిని తప్పుగా అర్థం చేసుకున్నారా?

Follow Us