Gold Price Today: పసిడి పరుగులు.. ఇవాళ భారీగా పెరిగిన బంగారం ధర
పసిడి ప్రియులకు షాకింగ్ వార్త. ఇటీవల తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో కోలుకోవడంతో నవంబర్ 26 నుంచి దేశీయంగా ధరలు భారీగా ఎగబాకాయి. నవంబర్ 27న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1750 పెరిగి రూ.1,26,550 పలుకగా, 22 క్యారెట్లపై రూ.1600 పెరిగింది.
పసిడి ప్రియులకు షాకింగ్ వార్త. గత వారం భారీగా పడిపోయిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు కొంత కోలుకోవడంతో, దేశీయ మార్కెట్లో నవంబర్ 26 నుంచి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనితో సామాన్యులకు షాక్ తగిలింది. నవంబర్ 27, శుక్రవారం నాడు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పెరిగి రూ.1,26,550కి చేరుకుంది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,600 పెరిగి రూ.1,16,000 పలికింది. ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,600, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,150 వద్ద ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర రూ.1,70,000 వద్ద ఉంది. బంగారంపై పెట్టుబడి అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ధరలను సరిచూసుకొని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగాళాఖాతంలో ద్రోణి.. హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. తెలంగాణలోనూ భారీ వర్షాలు
అందాన్ని పెంచే క్రీములే అనారోగ్యానికి కారణమా..?
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఎడారిలో లక్నవరం! బోట్ల స్థానంలో పరుగులు పెడుతున్న వాహనాలు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఘనంగా దీపోత్సవం
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
అనంత్ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స
రూ.40 లక్షలు ఇచ్చారు..తీరా కట్టలు విప్పిచూసి లబోదిబోమన్న వ్యాపారి

