AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

Phani CH
|

Updated on: Nov 26, 2026 | 9:35 PM

Share

కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టంలో మార్పులు చేస్తోంది. బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించనున్నారు. నంబర్ ప్లేట్‌లను స్కాన్ చేయడానికి ANPR కెమెరాలు ఏర్పాటు చేస్తారు. హర్యానా, యూపీలలో పైలట్ ప్రాజెక్ట్ మొదలవుతుంది. డ్రైవర్లలో బాధ్యత పెంచడమే దీని లక్ష్యం.

దేశంలో రోడ్డు భద్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టంలో గణనీయమైన మార్పులకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలకు అధిక బీమా ప్రీమియం విధించడంతో పాటు, బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా నిలిపివేయాలని ప్రతిపాదిస్తోంది. సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు ఈ నూతన విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఈ కఠిన నిబంధనలను అమలు చేయడానికి ఇంధన బంకుల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అటొమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను అమర్చి, వాహనాల నంబర్ ప్లేట్‌లను స్కాన్ చేస్తారు. ఈ స్కానింగ్ ద్వారా వాహన బీమా వివరాలను తనిఖీ చేసి, బీమా ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనం నింపేలా చర్యలు తీసుకుంటారు. ప్రారంభ దశలో, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని బంకుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. డ్రైవర్లలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడానికి, రహదారులపై భద్రతను మెరుగుపరచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Chandrababu: ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

Follow Us