పర్ఫెక్ట్ ఓనర్…ఇళ్ల అద్దెతో నెలకు రూ. 75 లక్షలు సంపాదన!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమాలతో, నిర్మాణంతో పాటు తన రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో వార్తల్లో నిలుస్తున్నారు. ముంబైలోని తన విలాసవంతమైన ఆస్తులను అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు సుమారు రూ. 75 లక్షల వరకు సంపాదిస్తున్నారట. ఈ తెలివైన రెంటల్ పాలసీ ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కేవలం సినిమాలతోనే కాదు, తన తెలివైన పెట్టుబడులతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్‌లో పెద్ద ప్రొడ్యూసర్‌గా, అనేక వ్యాపారాల్లో పెట్టుబడిదారునిగా ఉన్న అమీర్, ఇప్పుడు తన రియల్ ఎస్టేట్ ఆస్తుల ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. ముంబైలోని శాంతాక్రూజ్ సబర్బన్ ఏరియాలో అమీర్ ఖాన్‌కు మూడు విలాసవంతమైన ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిని నాలుగేళ్లకు లీజ్‌కి ఇవ్వగా, వాటి ద్వారా నెలకు మొత్తంగా 38 లక్షల అద్దెను అర్జిస్తున్నారట. ఈ ఫ్లాట్లు 11వ, 12వ, 14వ అంతస్తుల్లో విస్తరించి, మొత్తం 12,200 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. వీటిలో అతిపెద్ద ఫ్లాట్ నెలకు రూ. 20 లక్షలు, మిగిలిన రెండు ఫ్లాట్లు చెరో రూ. 9 లక్షల అద్దెను తెస్తున్నాయి. అంతేకాదు, అగ్రిమెంట్ ప్రకారం ఏడాదికి 5% అద్దె పెంపు రూల్ కూడా ఉంది. గతంలో పాలీ హిల్‌లో నాలుగు అపార్ట్‌మెంట్లను రూ. 24.5 లక్షల అద్దెకు లీజుకు ఇచ్చి రూ. 1.46 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ అందుకున్నారు. పలు నివేదికల ప్రకారం, అమీర్ ఖాన్ తన అద్దెల ద్వారా నెలకు సుమారు రూ. 75 లక్షలు సంపాదిస్తున్నాడు. సినిమాల్లోనే కాకుండా, పెట్టుబడి ప్రణాళికలోనూ మిస్టర్ పర్ఫెక్ట్ అని నిరూపించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై యూపీఐ, ఏటీఎం ద్వారా సులభంగా విత్‌డ్రా
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఘనంగా దీపోత్సవం
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
అనంత్ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స
రూ.40 లక్షలు ఇచ్చారు..తీరా కట్టలు విప్పిచూసి లబోదిబోమన్న వ్యాపారి

