కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో మరో వింత పార్టీ హల్‌చల్
సైలెంట్ పార్టీ పేరుతో హైదరాబాద్, విజయవాడల్లో వింత ప్రచారం జోరుగా సాగుతోంది. పంది ముఖం మాస్క్‌తో కూడిన పోస్టర్లు, పాలకులను విమర్శించే AI ఆడియో క్లిప్‌లు, QR కోడ్‌ల ద్వారా నిధుల సేకరణ వంటి అంశాలతో ఇది చర్చనీయాంశమైంది. ఎక్స్ (ట్విట్టర్)లో ప్రకాష్ రాజ్‌ను మాత్రమే ఫాలో అవుతున్న ఈ గ్రూప్‌పై పోలీసులు నిఘా పెట్టారు.
కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో మరో కొత్త రాజకీయ పార్టీ సైలెంట్ పార్టీ పేరుతో తెరపైకి వచ్చింది. గత రెండు రోజులుగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ పార్టీకి సంబంధించిన పోస్టర్లు విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. వీధులు, ఆటోలపైన కనిపిస్తున్న ఈ పోస్టర్లు సాధారణ రాజకీయ పార్టీల ప్రచారానికి భిన్నంగా ఉన్నాయి. ఈ పోస్టర్లలో పంది ముఖం మాస్కు ధరించిన మనిషి తలతో కూడిన ప్రొఫైల్ పిక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం భౌతిక పోస్టర్లకే కాకుండా, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లోనూ సైలెంట్ పార్టీ పేరుతో ఖాతాలు ప్రారంభమయ్యాయి. “వాడు పోతే వీడు, వీడు పోతే వాడు” అంటూ పాలకులపై విమర్శలు గుప్పించే ఏఐ ఆడియో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అధికారం మారడం మాత్రమే పరివర్తన కాదని, సామాన్యుడి జీవితంలో వచ్చిన మార్పే ముఖ్యమని ఈ ప్రచారం ద్వారా ప్రశ్నిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే, సైలెంట్ పార్టీ ఎక్స్ ఖాతాలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ను మాత్రమే ఫాలో అవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తున్న ఈ పోస్టర్లపై క్యూఆర్ కోడ్‌లు ముద్రించడం ద్వారా నిధుల సేకరణ ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ పోస్టర్లను అంటించినవారు ఎవరు, వాటిని ఎవరు డిజైన్ చేశారు, సోషల్ మీడియా ఖాతాలను ఎవరు నిర్వహిస్తున్నారు అనే కోణాల్లో పోలీసులు ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వివరాలను సేకరిస్తున్నారు. ఈ మిస్టీరియస్ ప్రచారం వెనుక ఉన్నది ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
CM Chandrababu: ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఘనంగా దీపోత్సవం
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
అనంత్ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స
రూ.40 లక్షలు ఇచ్చారు..తీరా కట్టలు విప్పిచూసి లబోదిబోమన్న వ్యాపారి

