Dhanush: నాలుగోసారి అదే కాంబో.. బాలీవుడ్లో ధనుష్ భారీ ప్లాన్!
కోలీవుడ్ స్టార్ ధనుష్ సౌత్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. బాలీవుడ్లో ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో చేసిన ప్రాజెక్ట్‌లు భారీ విజయాలు సాధించాయి. రాంజానా, అత్రంగీ రే వంటి చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులను అలరించిన ఈ కాంబో, గతేడాది తేరే ఇష్క్ మే చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ధనుష్ కెరీర్లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది.
కోలీవుడ్ స్టార్ ధనుష్ సౌత్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. బాలీవుడ్లో ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో చేసిన ప్రాజెక్ట్‌లు భారీ విజయాలు సాధించాయి. రాంజానా, అత్రంగీ రే వంటి చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులను అలరించిన ఈ కాంబో, గతేడాది తేరే ఇష్క్ మే చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ధనుష్ కెరీర్లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే సూపర్ హిట్ కాంబినేషన్ నాలుగోసారి రిపీట్ కాబోతోంది. ఈసారి వీరిద్దరూ తమ రెగ్యులర్ ఎమోషనల్ లవ్ స్టోరీల జానర్‌కు భిన్నంగా భారీ రొమాంటిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఈ విజువల్ వండర్‌గా తెరకెక్కనున్న సినిమా కోసం ఒక నయా వరల్డ్‌ను క్రియేట్ చేసే పనిలో టీమ్ నిమగ్నమై ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేసేందుకు జర్మన్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిక్టర్ను రంగంలోకి దింపారు. డాన్ 2, సాహో వంటి భారీ చిత్రాలకు పనిచేసిన రిక్టర్ రాకతో ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ భారీ సినిమా 2027 మధ్యలో సెట్స్ పైకి వెళ్లనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఘనంగా దీపోత్సవం
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
అనంత్ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స
రూ.40 లక్షలు ఇచ్చారు..తీరా కట్టలు విప్పిచూసి లబోదిబోమన్న వ్యాపారి

